Shahid Kapoor: విలాసవంతమైన కారు కొన్న స్టార్‌ హీరో.. ధర ఎంతంటే ?

4 Apr, 2022 17:24 IST|Sakshi

బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌, కబీర్ సింగ్‌ షాహిద్ కపూర్‌ కొత్త కారును కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన ఫొటోలను, వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. షాహిద్‌ కొన్న కొత్త కారు మెర్సిడెస్‌ మేబాచ్‌ ఎస్‌-580. దీని విలువ సుమారు రూ. 3 కోట్ల దాకా ఉంటుందని అంచనా. మెర్సిడెస్‌ కారులో డ్రైవ్‌ చేస్తున్న వీడియోను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేశాడు షాహిద్. దీనికి 'ఫాలింగ్‌ బ్యాక్‌ బ్యాచ్‌' అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 
 

A post shared by Auto Hangar Mercedes-Benz (@autohangar)

అనేక మంది బీటౌన్‌ తారలు, అభిమానులు, నెటిజన్లు ఈ పోస్ట్‌కు కామెంట్ పెడుతూ అభినందనలు తెలుపుతున్నారు. 'ఏప్రిల్‌లో మేబాచ్‌' అని ర్యాప్ సింగర్‌ బాద్‌ షా కామెంట్‌ చేశాడు. షాహిద్‌ వద్ద ఇదివరకే అనేక విలాసవంతమైన కార్లు ఉన్నాయి. జాగ్వార్‌, రేంజ్‌ రోవర్‌, మెర్సిడెస్, పోర్షే వంటి తదితర బ్రాండ్‌లు ఉన్నాయి. కాగా షాహిద్‌ కపూర్‌ ప్రస్తుతం జెర్సీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. షాహిద్ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్, పంకజ్‌ కపూర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం తెలుగు 'జెర్సీ' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కించారు. 
 

A post shared by Shahid Kapoor (@shahidkapoor)

మరిన్ని వార్తలు