Shahid Kapoor: నాకెప్పటికీ ఆ స్కూల్‌ డేస్‌ అంటే ఆసహ్యం

25 Apr, 2022 18:25 IST|Sakshi

Shahid Kapoor Says He Hates His School Days: బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ తాజాగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగు అర్జున్‌ రెడ్డి సినిమాను 'కబీర్‌ సింగ్‌'గా రీమెక్‌ చేసిన తర్వాత షాహిద్‌ చేస్తున్న మరో రీమెక్‌ చిత్రం ఇది. నెచురల్ స్టార్‌ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. కబీర్‌ సింగ్‌తో ఫాంలోకి వచ్చిన షాహిద్‌ ఈ మూవీతో ఎలాగైన మరో హిట్‌ కొట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (ఏప్రిల్‌ 22న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది.

చదవండి: ‘ఆచార్య’ హిందీ వెర్షన్‌పై క్లారిటీ ఇచ్చిన రామ్‌ చరణ్‌

అయినప్పటికీ ఈ చిత్రంలో షాహిద్‌ పాత్రకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. క్రికెట్‌ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో కొడుకు కోరికను నేరవెర్చే తండ్రిగా షాహిద్‌ ఒదిగిపోయాడు. ఈ క్రమంలో షాహిద్‌ పోషించిన భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ యావరేజ్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ నేషనల్‌ చానల్‌తో ముచ్చటించిన షాహిద్‌ వ్యక్తిగతం జెర్సీ కథకు బాగా కనెక్ట్‌ అయ్యానన్నాడు. అనంతరం ఈ సినిమాలో తన పాత్రకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక తన వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడుతూ ముంబైలోని తన స్కూలింగ్‌ డేస్‌ను గుర్తు చేసుకున్నాడు.

చదవండి: రాజమౌళి గురించి ఈ విషయం 12 ఏళ్ల క్రితమే చెప్పా: భాను చందర్‌

ఈ సందర్భంగా ముంబైలో తను చదివిన స్కూల్‌ అంటే అసహ్యం అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ‘నా పదేళ్ల వయసు వరకు ఢిల్లీలో చదివాను. అక్కడ స్కూల్స్‌ అంటే నాకు  చాలా ఇష్టం.  టీచర్లంతా స్టూడెంట్స్‌తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లు. విషయం ఏదైనా అర్థమయ్యేలా వివరించేవారు. ఇక అమ్మ జాబ్‌ నేపథ్యంలో మేం ముంబైకి వచ్చాం. దీంతో నేను ముంబై స్కూళ్లో చేరాను. ఆ స్కూల్‌ అంటే నాకెప్పటికీ అసహ్యం. ఎందుకంటే ఆ స్కూల్‌ టీచర్లు తరచూ నన్ను వేధించేశారు. వాళ్లు నాతో సరిగ్గా ఉండేవాళ్లు కాదు. అందుకే ఆ స్కూల్‌ డేస్‌ నాకెప్పటికీ నచ్చవు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అల్లు అరవింద్‌ సమర్పణలో దిల్‌రాజు, సూర్యదేవర నాగవంశీ, అమన్‌గిల్‌ నిర్మించిన హిందీ జెర్సీలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించింది.

మరిన్ని వార్తలు