పొట్టి బట్టలు వేసుకుందంటూ.. షాహిద్‌ కపూర్‌ భార్య మీరాపై ట్రోలింగ్‌

23 Oct, 2021 16:28 IST|Sakshi

నెట్‌ వాడకం పెరిగి సోషల్‌ వాడకం విస్తృతమైన ఈ తరుణంలో ఏ పని చేసిన ట్రోలింగ్‌ గురవుతున్నారు సెలబ్రిటీలు. తాజాగా బాలీవుడ్‌లో ‘అర్జున్‌ రెడ్డి’ని ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేసిన బాలీవుడ్‌ స్టార్‌ షాహిద్‌ కపూర్‌ భార్య మీరా రాజ్‌పుత్‌ విపరీతంగా ట్రోలింగ్‌ గురైంది.

ఇటీవలే ఈ జంట పిల్లలతో కలిసి మాల్దీవులలో ఎంజాయ్‌ చేసింది. తాజాగా వారు ఆ టూర్‌ నుంచి తిరిగి వస్తూ ముంబై విమానాశ్రయంలో మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియోని ఓ మీడియా సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అందులో షాహిద్‌, పిల్లలు పుల్‌ డ్రెస్‌లో ఉన్నారు. అయితే మీరా మాత్రం డెనిమ్‌ షార్ట్‌ వేసుకొని ఉంది. దీంతో భర్త, చివరికి చిన్న పిల్లలు కూడా పూర్తిగా బట్టలు ధరించారు కానీ భార్య మాత్రం పొట్టి బట్టలు వేసుకుంది అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. ‘నాకు పురుషులపై రోజు రోజుకి గౌరవం పెరిగిపోతోంది. ఎందుకంటే వారు పూర్తిగా దుస్తులు ధరించి సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. పురుషులందరికీ వందనాలు’ అంటూ తీవ్రంగా కామెంట్‌ పె​ట్టాడు మరో నెటిజన్‌. 

అయితే బాలీవుడ్‌ స్టార్‌ భార్య అయిన మీరాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె ట్రోలింగ్‌ గురవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ స్టార్‌ వైఫ్‌ని ట్రోల్‌ చేశారు నెటిజన్లు. అయినప్పటికీ ఎప్పుడూ స్పందించలేదు మీరా. ఈసారి ట్రోలింగ్‌పై రెస్పాండ్‌ అవుతుందో లేక ఎప్పటిలాగే ఏం పట్టించుకోకుండా ఉండిపోతుందో.. చూడాలి.

చదవండి: శృంగారం గురించి మాట్లాడాలంటే ఇక్కడి జనాలు భయపడతారు: దంగల్ నటి

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు