షకీలా కష్టాలతో...

27 Dec, 2020 00:32 IST|Sakshi
రిచా చద్దా

నటి షకీలా జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘షకీలా’. రిచా చద్దా, పంకజ్‌ త్రిపాఠీ, ఎస్తర్‌ నోరన్హ, రాజీవ్‌ పిళ్లై, శివ రానా, కాజోల్‌ చుగ్, సందీప్‌ మలని కీలక పాత్రలు పోషించారు. ఇంద్రజీత్‌ లంకేశ్‌ దర్శకత్వంలో ప్రకాష్‌ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్‌ హిందీలో ‘షకీలా’ చిత్రాన్ని నిర్మించి, అన్ని భాషల్లో అనువదించారు. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో శుక్రవారం ఈ సినిమాని విడుదల చేయగా, జనవరి 1న యుఎఫ్‌ఓ మూవీస్‌ ద్వారా తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ‘షకీలా’ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుండి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ట్రైలర్‌లో చూపించారు. ‘‘బోల్డ్‌ కంటెంట్‌ కారణంగా ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్‌ లభించినప్పటికీ, ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సెన్సార్‌ బోర్డు కమిటీ ప్రశంసించింది. సినిమా థీమ్, మంచి సందేశానికి వారి నుండి ప్రశంసలు లభించాయి’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి అసోసియేట్‌ నిర్మాత: సదీప్‌ మలాని, కెమెరా: సంతోష్‌ రాయ్‌ పతజే.

మరిన్ని వార్తలు