రిచా చద్దా ‘షకీలా’ టీజర్‌ విడుదల

9 Dec, 2020 14:38 IST|Sakshi

ముంబై: దక్షిణాది ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘షకీలా’ సినిమాలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా లీడ్‌ రోల్‌ పోషిస్తున్నారు. సామీ మ్యాజిక్‌ ప్రొడక్షన్‌లో ఇంద్రజీత్‌ లంఖేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ గురువారం విడుదలైంది. తెర వెనుక షకీలా ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాలను దర్శకుడు ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. ఇక టీజర్‌ విషయానికొస్తే.. 1990లో ఖాళీగా ఉన్న సినిమా థియేటర్లు హౌజ్‌ఫుల్‌ కావాలంటే డిస్ట్రిబ్యూటర్లకు ఒకేఒక పేరు వినిపించేది. ఆ పేరు షకీలా. సంక్షోభ సమయంలో 90ల్లో సినిమా హాళ్లను ఆర్థికంగా ఆదుకున్న ఆమె సినిమాలకు అప్పుట్లో ఎక్కువ క్రేజ్‌ ఉండేది. అటువంటి నటి జీవితం ఆధారంగా సాగే ఈ సినిమా ఇప్పుడు 2020లో సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూతపడిన థియేటర్లు తిరిగి తెరుచుకున్నాక షకీలా పేరు థియేటర్లలో వినిపించనుంది అంటూ ఈ టీజర్‌ సాగుతోంది. (చదవండి: కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ)

అయితే 1990లో దక్షిణాది సినీ పరిశ్రమలో శృంగార తారగా రాణించిన షకీలా సంప్రదాయ ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. 16 ఏళ్ల వయసులోనే పరిశ్రమకు వచ్చిన ఆమె అతికొద్ది కాలంలోనే స్టార్‌ హీరోల సినిమాల్లో నటించారు. ఇక షకీలా టీజర్‌ విడుదలైన సందర్భంగా నటి రిచా చద్దా స్పందిస్తూ.. ‘చివరికి ఈ సినిమా విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా వంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రజల జీవితాల్లో నవ్వును, ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తున్న. కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన సినిమా హాళ్లను ఈ ఏడాది షకీలా  సినిమాతో సంతోషంగా ముగుస్తుందని ఆశిస్తున్న. దక్షిణాదిన ప్రసిద్ది చెందిన ఆమె కథను బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో తెలుసుకోవడం కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. 1990లో సంక్షోభ సమయల్లో సినిమా హాళ్లకు స్థిరమైన వ్యాపారాన్ని అందించిన ఆమె సినిమాలు.. ఇప్పుడు 2020లో థియేటర్‌లను కూడా ఆర్థికంగా ఆదరిస్తుందో లేదో చూడాలి కూడా’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమా డిసెంబర్‌ 25న విడుదల కానుంది. (చదవండి: త‌నిష్క్ యాడ్‌లో నా జీవితం క‌నిపిస్తోంది: న‌టి)

మరిన్ని వార్తలు