11 ఏళ్లుగా షకీరాతో సహజీవనం, బ్రేకప్‌.. ఇప్పుడు ఇంకో అమ్మాయితో!

26 Aug, 2022 17:42 IST|Sakshi

మ్యూజిక్‌ క్వీన్‌ షకీరా - ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ గెరార్డ్‌ పిక్‌ ఇద్దరూ ఇటీవలే బ్రేకప్‌ చెప్పుకున్న విషయం తెలిసిందే! అయితే విడిపోయి నెల రోజులైనా కాకముందే గెరార్డ్‌ మరో అమ్మాయితో లవ్‌లో పడ్డాడు. మోడల్‌ క్లారా చియాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. వీరిద్దరూ చేతిలో చేయేసి నడుస్తున్న ఫొటోలు, స్విమ్మింగ్‌ పూల్‌లో ముద్దులు పెట్టుకుంటున్న పిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ అప్పుడే వేరొక అమ్మాయితో ఇలా తిరుగుతుండటం చూసి తట్టుకోలేకపోయిందీ సింగర్‌. ఈ ఫొటోలు చూసి తన గుండె పగిలిందంటూ అక్కడి మీడియాతో వాపోయిందట. 

కాగా షకీరా కంటే గెరార్డ్‌ పదేళ్లు చిన్నవాడు.  షకీరా పాడిన వకా వకా సాంగ్‌ వీడియోలో గెరార్డ్‌ ఉన్నాడు. అలా వీళ్లిద్దరికీ పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. 2010 నుంచి డేటింగ్‌ చేసుకుంటున్నా, ఈ విషయాన్ని షకీరా 2011లో అధికారికంగా వెల్లడించింది. వీరిద్దరికీ 2013లో మిలన్‌, 2015లో సాషా అని ఇద్దరు కొడుకు జన్మించారు. పాప్‌ సింగర్‌కు పెళ్లంటే భయం ఉండటంతో వీరు వివాహం చేసుకోకుండానే పదకొండేళ్లుగా కలిసి జీవించారు. ఈ ఏడాది జూన్‌లో విడిపోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం షకీరా డ్యాన్సింగ్‌ విత్‌ మైసెల్ఫ్‌ అనే టీవీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది.


(ఫొటో సేకరణ: సీఎన్‌ఎన్‌)

A post shared by TEVERED MX (@teveredmx)

చదవండి: హృతిక్‌ రోషన్‌.. హీరోయిన్‌ ప్రైవేట్‌ ఫొటోలు చూపించాడు
ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా?

మరిన్ని వార్తలు