Shankar Mahadevan: భం...భం అఖండ అంటూ ఖంగున మోగే కంఠం ఆయన సొంతం

3 Mar, 2022 12:01 IST|Sakshi

ఆయన పాట వింటే తనువు పరవసిస్తుంది. మనసు పులకరిస్తుంది. గుండె సంబరపడుతోంది. ఆయనే భారతీయ సంగీత స్వరకర్త శంకర్‌ మహదేవన్‌.  ఆకాశం అమ్మాయితే లాంటి రొమాంటిక్ పాట అయిన ,మహాప్రాణ గీతం అనే భక్తిరస పాట అయిన , కొడితే కొట్టాలిరా అని మాస్ సాంగ్ అయిన ఆయన గాత్రంతో కొత్త అందం తీసుకొస్తాడు.ఆయ‌న పాడిన బ్రీత్‌లెస్ ట్రాక్ అప్ప‌డు, ఇప్ప‌డూ సూప‌ర్‌హిట్టే. నేడు ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా శంకర్‌ మహదేవన్‌ జర్నీపై ఓ లుక్కేద్దాం

1967 మార్చి 3న ముంబైలో పుట్టి పెరిగాడు శంకర్‌ మహదేవన్‌.  బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. ఐదేళ్ల వయసులోనే వీణ వాయించటం ప్రారంభించాడు. మరాఠీ సంగీత స్వరకర్తగా పేరు పొందిన పండిట్ శ్రీనివాస్ ఖలే మార్గదర్శకత్వంలో సంగీతాన్ని అభ్యసించాడు. చదువు  పూర్తి అయిన తరువాత కొన్నాళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేశాడు. అలా కొంతకాలం పని చెసిన తర్వాత సంగీతం రంగంలోకి అడుగుపెట్టాడు. ప్లేబ్యాక్ సింగర్‌గా ఒక తమిళ చిత్రంలో తొలి అవార్డును సాధించాడు.  ఎఆర్. రెహమాన్ తో కలసి పాడిన  పాట ఆయనకు  జాతీయ చలన చిత్ర అవార్డు తెచ్చిపెట్టింది. 1998లో మహదేవన్ నిర్మించి పాడిన బ్రీత్‌లెస్‌ ఆల్బమ్  పెద్ద సంచలనం. ఆ తర్వాత ఆయన వరసగా సినిమాలకి మ్యూజిక్  అందించడం, అలాగే పాటలు పాడటం మొదలెట్టాడు.

ఇక తెలుగులో ఆయన పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వొస్తానంటే  నేనొద్దంటానా లో చంద్రుడిలో ఉండే కుందేలు పాట , అత్తారింటికి దారేది లో అమ్మో బాపుగారి బొమ్మో పాట, మొన్నటి అఖండ టైటిల్‌ సాంగ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తెలుగు వాడు కాకపోయినప్పటికీ.. కఠినమైన పదాలను సైతం చాలా అలవోకగా పాడేయడం ఆయన స్పెషల్‌. 

తెలుగులో శంకర్ మహదేవన్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన ఏకైక సినిమా సిద్దార్ధ నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్‌ హిట్టే. ఇక హిందీలో ఆయన సంగీతం అందించిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుక్కతిప్పుకోకుండా, ఊపిరి బిగబట్టి పాటలు పాడి శ్రోతల్ని మంత్రముగ్థుల్ని చేసే ప్రతిభ అతని సొంతం. అందరుకే సినీ సంగీత  ప్రపంచంలో శంకర్‌ మహదేవన్‌ పేరు చిర‌స్థాయిగా నిలిచిపోతుందని ఆయన ఫ్యాన్స్‌ ఆనంద పారవశ్యంలో మునిగి తేలతారు.

ఇక అవార్డుల విషయానికొస్తే..  ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును గెలుపొందారు. నాగార్జున హీరోగా నటించిన శిరిడి సాయిలోని ఒక్కడే దేవుడు పాటకు గానును నంది అవార్డు వచ్చింది. అలాగే  2019 లో ఆయన సంగీతానికి చేసినా సేవకి గాను  పద్మ శ్రీ తో ప్రభుత్వం సత్కరించింది.

మరిన్ని వార్తలు