Deepthi Sunaina: 'ఫిజికల్‌ అయ్యి గట్టిగా అరిస్తే గేమ్‌ ఆడినట్లా?' సన్నీకి చురకలు

13 Nov, 2021 11:08 IST|Sakshi

Bigg Boss Telugu 5: Deepthi Sunaina Strong Counter To Vj Sunny : బీబీ హోటల్‌ టాస్క్‌లో షణ్ను, సన్నీలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్‌లో తన టవర్‌ కాపాడుకుంటున్న తరుణంలో సన్నీ-సిరిలకు మధ్య జరిగిన గొడవలో షణ్నూ కలగజేసుకోవడంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో సన్నీ-షణ్నూలకు మధ్య పెద్ద వారే జరిగింది. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని గేమ్‌ ఆడుతున్నావ్‌ అంటూ సన్నీ రెచ్చిపోయాడు. దీనిపై షణ్నూ గర్ల్‌ఫ్రెండ్‌ దీప్తి సునయన కౌంటర్‌ రిప్లై ఇచ్చింది. 

'అప్పడం అయిపోతావ్‌ అనవసరంగానా? చేతగాని ఆటలు ఆడుతున్నాడు ఏంటి? ఫిజికల్‌ అయ్యి గట్టి గట్టిగా అరిస్తే గేట్‌ ఆడినట్లా? ఫిజికల్‌ అవ్వడం కన్నా కష్టం అయిన టాస్క్‌ మైండ్‌తో ఆడటం. అది షణ్నూ వంద శాతం ఇస్తున్నాడు. బిగ్‌బాస్‌ చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది. ఎంత మెచ్యూర్‌గా బిహేవ్‌ చేస్తున్నాడు. సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లని అడ్డుపెట్టుకొని గేమ్‌ ఆడినట్లా? మరి నీకు కాజల్‌, మానస్‌ సపోర్ట్‌ చేసినప్పుడు ఏమైంది?నువ్వు ఎలా ఉండాలో మిగతా వాళ్లుకూడా అలానే ఉండాలా ఏంది?

నువ్వు బెస్ట్‌ అనుకోం తప్పులేదు. కానీ మిగతా అందరిని ఎందుకు అలా చూస్తున్నారు?నీలా ఇంకొకరు ఉండలేరు. ఇంకొకరిలా నువ్వు ఉండలేవు. యూట్యూబ్‌ వరకే గుర్తుపెట్టుకోనా? ఈ స్టేజ్‌ వరకు వచ్చాడు అంటే ఎంత కష్టపడి వచ్చాడు అని హ్యాపీగా ఫీల్‌ అవ్వకుండా అలాంటి మాటలు అనడం తప్పు సన్నీగారు. మీకు రా అంటేనే పడలేకపోయారు. మరి మీరు అన్ని మాటలు అంటే ఎలా?' అంటూ సన్నీని ఏకిపారేసింది.

దీనికి సంబంధించిన ఇన్‌స్టా పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.మరోవైపు షణ్నూ ఆటను పొడగ్తలతో ముంచెత్తింది. 'తప్పు అయితే నేర్చుకుంటాం రా బై అని ఎంత బాగా చెప్పావ్‌ షణ్నూ..నిన్ను హగ్‌ చేసుకోవాలనుంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.

మరిన్ని వార్తలు