'దీప్తి సునయన -షణ్ముఖ్‌ పెళ్లి అప్పుడే ఉండొచ్చు'

27 Apr, 2021 12:59 IST|Sakshi

సోషల్‌ మీడియాలో స్టార్స్‌ దీప్తి సునయన, షణ్ముఖ్‌ జశ్వంత్‌ క్యూట్‌ పెయిర్‌కు ఎంతో మంది అభిమానులున్నారు. కవర్‌ సాంగ్స్‌, డ్యాన్స్‌ వీడియోలతో ఈ జంటకు యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. అయితే బిగ్‌ బాస్‌ సీజన్‌-2 పాల్గొన్న దీప్తి సునయన షో తర్వాత మాత్రం నెగిటివినీ మూటగట్టుకుంది. దీంతో షణ్ముఖ్‌తో బ్రేకప్‌ అయిపోయిందని, వీరి లవ్‌ కహానీకి శుభం కార్డు పడిందని అప్పట్లో పలు వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

అయితే తాజాగా ఓ ప్రముఖ షోలో పాల్గొన్న దీప్తి- షణ్ముఖ్‌​.. తాము ఆఫ్‌ స్ర్కీన్‌ కపుల్స్‌ అని క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టినట్లయ్యింది. అంతేకాకుండా ఇద్దరూ ఒకే తరహా టాటూలు వేయించుకొని ఒకరిపై ఒకరికున్న ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి రిలేషన్‌ షిప్‌పై ఓ వెబ్‌ సిరీస్‌ నటుడు సూర్య స్వామి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో దీప్తి-షణ్ముఖ్‌ పెళ్లి ప్రస్తావన రాగా.. 'అందులో తప్పేం ఉంది.ఎవరి ఇష్టం వారిదని ఇంకోం రెండేళ్లలో వారు పెళ్లి కూడా చేసుకోవచ్చు' అంటూ హింట్‌ ఇచ్చేశాడు.

దీంతో ఈ కామెంట్స్‌ ఇప్పుడు  సోషల్‌ మీడియాలో హల్‌చల్‌గా మారాయి. త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌తో యూట్యూబ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్‌ ప్రస్తుతం ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు. బిగ్‌బాస్‌ సీజన్‌-5లోనూ ఎంపికైన మొదటి కంటెస్టెంట్‌గా షణ్ముఖ్‌ పేరు వైరల్‌ అవుతోంది.

చదవండి : 'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి
'పెళ్లికూతురిగా నిత్యామీనన్: దయచేసి ఆ మాట అనొద్దు!‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు