Sharad Kelkar: ఒకే గదిలో తొమ్మిది మంది.. రోజుకు రూ.25తోనే బతికా: శరద్ కేల్కర్

2 Apr, 2023 10:11 IST|Sakshi

బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ మొదట బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. శరద్ 2004లో హిందీ సినిమా హల్ చల్  ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టారు. శరద్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, మరాఠి భాషా సినిమాల్లో నటించారు. టాలీవుడ్‌లో సర్దార్ గబ్బర్‌ సింగ్ మూవీలో రాజా భైరోన్ సింగ్ పాత్రలో నటించారు. అయితే తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2002లో ముంబయికి వచ్చాక చిత్ర పరిశ్రమలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకున్నాడు. ఇటీవల ఆయన పాల్గొన్న సైరస్ బ్రోచా పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాలను వెల్లడించారు. 


శరద్ కేల్కర్ మాట్లాడుతూ.. 'నేను బాంద్రాలోని బజార్ రోడ్‌లో ఒక గదిలో ఉండేవాన్ని. ఒకే రూమ్‌లో తొమ్మిది మంది కలిసి ఉండేవాళ్లం. అదే రూమ్‌ను రాజస్థానీ డాబాగా ఉపయోగించేది. అక్కడ ఒక చపాతీ 2 రూపాయలకు అమ్మేవారు. అక్కడే నేను గ్యాస్ సిలిండర్లు చూసుకునేవాడిని. అందుకు వారితో నా ఒప్పందం రోజుకు నాలుగు గుడ్లు, రెండు రోటీలు. అది రెండుపూటలా ఇవ్వాలి. నేను అలా రోజుకు రూ. 25తోనే బతికా. మేము ఏదైనా పని దొరికినప్పుడు మాత్రమే పార్టీ చేసుకునేవాళ్లం. అప్పట్లో తాను పనిచేసే జిమ్‌లో నెలకు రూ. 2750 సంపాదించేవాడిని. ఆ తర్వాత ఓ ఫ్యాషన్ షోలో రూ. 5000 ఆఫర్ చేసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.' అని అన్నారు. 
 

మరిన్ని వార్తలు