సమయం మారింది

10 Oct, 2022 05:03 IST|Sakshi
విజయశాంతి, గణపతి రెడ్డి, మల్లిక్‌

– విజయశాంతి

ఓ గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే.. ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు ఎలా వ్యతిరేకత కనబరిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘శరపంజరం’. టి. గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్‌ కుమార్‌ గట్టు, లయ జంటగా నవీన్‌ కుమార్‌ గట్టు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని రెండో పాట ‘రావయ్యా నందనా రాజా నందన..’ పాటను ప్రముఖ నటి విజయశాంతి విడుదల చేశారు.

మల్లిక్‌ ఎంవీకే స్వరపరచిన ఈ పాటను జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి, పాడారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఆనాడు దొరలు స్వార్థం కోసం ఆడవాళ్లని ఎలా వాడుకున్నారో తెలిసిన విషయమే. ఈనాటి దొర కూడా ఎలా చేస్తున్నాడో తెలిసిన విషయమే. సమయం మారింది కానీ వ్యక్తి మనస్తత్వం మారలేదనడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలుస్తుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు