Sharukh Khan Birthday: బాద్‌షా బర్త్‌ డే స్పెషల్.. 'డంకీ' టీజర్ అవుట్!

2 Nov, 2023 12:29 IST|Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం డంకీ. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది.  గౌరీ ఖాన్, రాజ్‌కుమార్‌ హిరాణి, జ్యోతిదేశ్‌ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్ట్‌మస్‌ కానుకగా అభిమానులను అలరించనుంది. 

తాజాగా నవంబర్‌ 2న కింగ్‌ ఖాన్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్‌ ప్రైజ్ ఇచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డంకీ టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే ఐదుగురు కలిసి ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌ ప్రాంతంలోని యువకుల కథనే ఇందులో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌ వెళ్లేందుకు వారు ఎలా ప్రయత్నించారు? వారికెదురైన సమస్యలేంటి అనేది తెలియాలంటే డంకీ సినిమా చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 22న రిలీజ్ కానుంది.

మరిన్ని వార్తలు