Sharukh Khan: మీ సినిమా మూడుసార్లు చూశా.. బన్నీపై బాద్ షా ప్రశంసలు!

14 Sep, 2023 20:06 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అంటే పాన్ ఇండియాలో తెలియని వారు ఉండరు. పుష్ప సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వచ్చింది.  పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్‌ను రీక్రియేట్ చేయని సెలబ్రిటీలు ఉండరు. ఇటీవలే నేషనల్ అవార్డ్ అందుకున్న ‍బన్నీపై బాలీవుడ్ బాద్‌షా  ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్‌ మూవీ సక్సెస్‌పై బన్నీ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన షారుక్ ఖాన్‌.. బన్నీని పొగుడుతూ ట్వీట్‌ చేశారు. 

(ఇది చదవండి: పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్! )

షారుక్ ‍ట్వీట్‌లో రాస్తూ.. 'నీ ప్రేమకు చాలా ధన్యవాదాలు. మీలోని 'ది ఫైర్' నన్ను మెచ్చుకుంటోంది. పుష్ప చిత్రాన్ని మూడుసార్లు చూశాను. మీ నుంచి చాలా నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు. వీలైనంత త్వరగా వచ్చి మీకు వ్యక్తిగతంగా అందిస్తాను. లవ్‌ యూ బన్నీ.' అంటూ రిప్లై ఇచ్చారు. షారుక్ ట్వీట్ చేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. 

ఇటీవలే జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్.. 'షారుక్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించినందుకు టీమ్ అందరిని అభినందించారు. షారుక్ అవతార్‌తో పాటు ఆయన స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు  బన్నీ తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటనతో పాటు, అనిరుధ్ మ్యూజిక్,డైరెక్టర్ అట్లీని కూడా ప్రశంసించారు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్‌ నటుడు కన్నుమూత!)


 

మరిన్ని వార్తలు