'హెల్తీవే రెస్టారెంట్‌'ను ప్రారంభించిన శర్వానంద్‌, బాబీ

4 Dec, 2021 15:16 IST|Sakshi

Sharvanand And Director Bobby Inaugurated A Restaurant: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 3లో హైదరాబాదీల కోసం సరికొత్త రుచులు రుచిచూపించేందుకు 'హెల్తీవే రెస్టారెంట్‌ బై ఆర్యన్‌' పేరుతో హోటల్‌ ప్రారంభమైంది. ఈ హోటల్‌ను హీరో శర్వానంద్‌, డైరెక్టర్‌ బాబీ, నటి హిమజా ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌ వ్యవస్థాపకులు స్వప్నిక, ఆర్యన్‌, బాలు, జితేందర్‌. రెస్టారెంట్‌లో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. ఆరోగ్యం, బరువు అవసరాలకు అనుగుణంగా వివిధ ఆహార ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ప్రతీ వారం ఎప్పటికప్పుడు కొత్త మెనూతోపాటు ఫుడ్‌ డెలీవర్‌ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. 

సుమారు 20 ఏళ్ల అనుభవం గల చెఫ్‌ వండిన వంటకాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని వ్యవస్థాపకులు తెలిపారు. శ్రద్ధ, నిబద్ధత గల సిబ్బందితో మంచి అనుభూతి చెందుతారన్నారు. పోషకాహార నిపుణులు, వృత్తిపరమైన చెఫ్‌లు ఉంటారన్నారు. వారు ఒకరికొకరు కలిసి పని చేస్తారని, కస్టమర్ల జీవక్రియ మార్పులను పర‍్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే శర్వానంద్ ఇటీవలే 'మహా సముద్రం' సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తర్వాత కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో వస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'ఒకే ఒక జీవితం' చిత్రాల్లో నటించనున్నారు. 

మరిన్ని వార్తలు