లక్ష్మీనృసింహుని సన్నిధిలో శర్వానంద్, రష్మిక 

29 Oct, 2021 09:48 IST|Sakshi
అంతర్వేది ఆలయంలో అర్చకులతో హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మికా మంధన్న   

సాక్షి, సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ చిత్రం హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మికా మంధన్న గురువారం సందడి చేశారు. స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి ఆశీర్వచనాలు తెలిపారు. క్షేత్ర మహాత్మ్యం గురించి వారు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆలయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సందడి చేశారు.

లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సారథ్యంలో తిరుమల కిశోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సందర్భంగా శర్వానంద్, రష్మిక మాట్లాడుతూ, గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు. చక్కటి వాతావరణం, కొబ్బరి తోటలు, పంట పొలాలు కనువిందు చేస్తున్నాయని అన్నారు. 

చదవండి: (అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్‌ అజయ్‌భూపతి)

మరిన్ని వార్తలు