ఇంట్రస్టింగ్‌గా శర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’ మోషన్‌ పోస్టర్‌

15 Jul, 2021 20:18 IST|Sakshi

యంగ్ హీరో శ‌ర్వానంద్ 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రం ద్వారా శ్రీకార్తిక్  ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు ఈ మూవీని నిర్మిస్తున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీలో శర్వానంద్‌ పాత్ర పేరు ఆది. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ స్నీక్‌ ప్రోమోను మూవీ యూనిట్‌ తాజాగా విడుదల చేసింది‌. 

ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదీని కోరడం అలాగే మ్యూజిక్ ఇన్స్‌ట్రూమెంట్స్ చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. చివ‌ర‌లో శర్వానంద్ గిటార్ వాయిస్తూ కనిపిస్తాడు. ఇందులో శ‌ర్వానంద్‌ సరసన రీతూ వ‌ర్మ‌హీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి ప్రధాన పాత్రలు కనిపించనున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. ఈ మూవీ జేక్స్ బీజోయ్ సంగీతం అందిస్తున్నాడు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం అటూ ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ఇటూ యూత్‌ను ఆకట్టుకుంటుందని మేకర్స్‌ పేర్కొన్నారు. కాగా ఇప్ప‌టికే ఈ మూవీ.. షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు