శర్వానంద్‌ ఒకే ఒక జీవితం మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల

28 Jun, 2021 18:27 IST|Sakshi

నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్‌ హీరో శర్వానంద్‌ 30వ చిత్రంగా ‘ఒకే ఒక జీవితం’ తెరకెక్కతుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌ బాబు, ఎస్‌ ఆర్‌ ఫ్రభులు నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా మూవీ యూనిట్‌ విడుదల చేసింది. ఈ మూవీకి ఒకే ఒక లోకం అనే టైటిల్‌ను మేకర్స్‌ చేశారు. శ‌ర్వానంద్ గిటార్‌తో దర్శనం ఇచ్చాడు.  సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతుంది. ఇక సరికొత్తగా విడుదల చేసిన ఈ ఫస్ట్‌లుక్‌లో పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు.

మరోవైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్స్‌తో ఉన్న ఈ పోస్టర్‌ను చూస్తుంటే ప్రపంచీకరణ ప్రభావాన్ని వివరించేలా ఈ మూవీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఇందులో శ‌ర్వానంద్‌ సరసన రీతు వ‌ర్మ‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి సహానటులుగా కాగా అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌ పోషించనుండటం విశేషం. త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీకి జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు