అలల కంటే మొం‍డివాడిని.. మరి మీరూ?!

14 Nov, 2020 18:32 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’తో సూపర్‌ హిట్‌ అందుకున్న దర్శకుడు అజయ్‌ భూపతి ఇటీవల శర్వానంద్‌, హీరో సిద్దార్థ్‌లతో మల్లీస్టార్‌ చిత్రం ‘మహాసముద్రం’ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ థీమ్‌ పోస్టర్‌ను హీరో శర్వానంద్‌ దీపావళి సందర్భంగా విడుదల చేశాడు. ఎకే ఎంటర్టైనమెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ థీమ్‌ పోస్టర్‌ను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ... ‘సముద్రం అంతా లోతు, అలల కంటే మొండివాడిని.. అంటూ తన సహా నటులైన సిద్దార్థ్‌తో పాటు హీరోయిన్స్‌ అదితి రావ్‌, అను ఇమ్మాన్యూమేల్‌లను ట్యాగ్‌ చేసి మరీ మీరు ఎవరూ అని ప్రశ్నించాడు. అంతేగాక దర్శకుడు అజయ్‌ భూపతి, నిర్మాతలను ట్యాగ్‌ చేసి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: షేక్‌ చేస్తున్న శర్వానంద్‌ ‘భలేగుంది బాలా’ సాంగ్‌)

కాగా అజయ్‌ భూపతి మొదటిసారిగా దర్శకత్వం వహించిన రొమాంటిక్‌ చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌ కావడంతో  ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎర్రటి ఆకాశం, సముద్రం బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రిడ్జికి అవతలవైపు ఓ వ్యక్తి పరుగులు తీస్తూ, ఇవతల బ్రిడ్జి‌పై ఇద్దరూ మనుషులు గన్‌పై నిలుచున్నట్లుగా ఉండి పరుగెడుతున్న వ్యక్తి వైపు గురిపెడుతున్న ఈ పోస్టర్‌ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇక పొస్టర్‌కు కింద ‘అమితమైన ప్రేమ’ అనే ట్యాగ్‌ లైన్‌ ఉండటం చూసి ‘సముద్రం’ రోమాంటిక్‌, థ్రీల్లర్ నేపథ్యంలో సాగనుందని, దర్శకుడు ఈ సినిమాను ఓరెంజ్‌లో చూపించబోతున్నాడంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక దాదాపు ఏడేళ్ల తర్వాత ‘బొమ్మరిల్లు’ హీరో సిద్దార్థ్‌ తెలుగు రీఎంట్రీ ఇవ్వడంలో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్‌ జరుపుకుంటోంది. (చదవండి: టాలీవుడ్‌లో కొత్త జోడి.. సాయి కాదు అదితి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా