‘రన్‌  రాజా రాన్‌ ’ ఫ్లేవర్‌  ‘క్రేజీ ఫెలో’ లో కనిపిస్తోంది: శర్వా

11 Oct, 2022 06:20 IST|Sakshi
సంపత్‌ నంది, మిర్నా, శర్వానంద్, ఆది, రాధామోహన్, ఫణి కృష్ణ సిరికి

– శర్వానంద్‌

‘‘హీరో ఆది సాయికుమార్‌ని నేను బ్రదర్‌లా భావిస్తాను. ఆదికి సక్సెస్‌ వస్తే నేనూ ఎంజాయ్‌ చేస్తాను. నిర్మాత రాధామోహన్‌ గారు పదేళ్లుగా తెలుసు. నేను హీరోగా చేసిన ‘రన్‌  రాజా రాన్‌ ’ ఫ్లేవర్‌  ‘క్రేజీ ఫెలో’ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి’’ అన్నారు శర్వానంద్‌. ఆది సాయికుమార్, మిర్నా మీనన్‌  జంటగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కేకే రాధామోహన్‌  నిర్మించిన చిత్రం ‘క్రేజీ ఫెలో’. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో హీరో శర్వానంద్, దర్శకులు మారుతి, సంపత్‌ నంది అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు మారుతి.

‘‘రాధామోహన్‌ గారితో తొలి సినిమా చేసే దర్శకులకు విజయం వస్తుంది. అలా ఫణి కృష్ణకు కూడా ‘క్రేజీ ఫెలో’తో విజయం వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు సంపత్‌ నంది. ‘‘క్రేజీ ఫెలో’ హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌. సినిమాలో మంచి ఎమోషన్‌  కూడా ఉంది’’ అన్నారు ఆది. ‘‘ఈ సినిమాలో ఆది సాయికుమార్‌ కొత్తగా కనిపిస్తారు. మేం అందరం క్రేజీగా పని చేశాం’’ అన్నారు ఫణి కృష్ణ. ‘‘ఈ కథకు ఆది బాగా సరిపోయాడు. దర్శకుడిగా ఫణి కృష్ణకు మంచి భవిష్యత్‌ ఉంది’’ అన్నారు రాధామోహన్‌ . ఈ కార్యక్రమంలో నటుడు అనీష్‌ కురువిల్లా, నటి వినోదినీ వైద్యనాథన్, లిరిక్‌ రైటర్‌ కాసర్ల శ్యామ్, యాక్షన్‌   కొరియోగ్రాఫర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు