ఆ పిల్ల అంటే నాకు ప్రాణం.. ఆసక్తి రేపుతున్న ‘శతఘ్ని’ ట్రైలర్

21 May, 2021 14:04 IST|Sakshi

అభిరామ్ రెడ్డి దాసరి హీరోగా, స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం  ‘శతఘ్ని’. 2010 లో ఆంధ్ర తీరప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి  ఎల్వీ  శివ దర్శకత్వం వహిస్తున్నాడు.  స్వాతి మండల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కేరాఫ్‌ కంచరలపాలేం ఫేమ్‌ సుబ్బరావు, కిషోర్‌, వైజాగ్ ధనరాజ్, కళ్యాణ్ కృష్ణ, సన్నీ, కరుణ్ కాంత్, కోలా మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.. హైదరాబాదీ మూవీస్ ఫేమ్ గుల్లు దాదా ఇందులో చాలా కీలకమైన పాత్రని పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.‘ఆ పేరంటే నాకు ఇష్టం, ఆ పిల్లంటే నాకు ప్రాణం’అనే డైలాగ్‌తో మొదలయ్యే ఈ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది.  ఉత్కంఠను పెంచే విధంగా ట్రైలర్‌ని కట్‌ చేశారు. 

ట్రైలర్‌ లాంచ్‌ అనంతరం చిత్ర నిర్మాత, హీరో దాసరి అభిరామ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా రూపొందించాం.. ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.. కరోనా సమయంలో ఇబ్బంది పడే వారికి సహాయం చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. త్వరలో నే ఈ సినిమా కి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తాం.. ట్రైలర్ ఎంతో బాగుంది.. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు.. ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా నటించారు’ అని తెలిపారు.

దర్శకుడు ఎల్.వి.శివ మాట్లాడుతూ.. చాలా కష్టపడి సినిమా ను తెరకెక్కించాము.. ఈ సినిమా కి నిర్మాతగా, హీరోగా అభిరాం గారు అందించిన సహాయం మర్చిపోలేనిది.. మధుర ఆడియో ద్వారా విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.. కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల కొంత ఆలస్యమవుతుంది అన్నారు.

యాక్షన్-సస్పెన్స్-క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోగా, రాం సుంకర ఫైట్స్ సత్య మాస్టర్ కోరియోగ్రఫీ ని అందించారు..  హర్ష ప్రవీణ్ సంగీతం సమకూరుస్తుండగా ఎం.డి. రఫీ సినిమాటోగ్రఫర్ గా , క్రాంతి (ఆర్. కె) ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు