Sidharth Shukla: సిద్ధార్ధ్‌కు నివాళి తెలుపనంటున్న షెహనాజ్‌ సోదరుడు

4 Sep, 2021 12:26 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ టీవీ నటుడు, బిగ్‌బాస్‌ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణంతో అతడి కుటుంబంతో పాటు, బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. నిన్న(శుక్రవారం) ముంబైలో జూహులో కుటుంబ సభ్యులు, బాలీవుడ్‌ టీవీ నటీనటుల ఆశ్రునివాళి మధ్య సిద్ధార్థ్‌ అంత్యక్రియలు ముగిశాయి. అనంతరం సిద్ధార్థ్‌  రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ షెహనాజ్‌ గిల్‌ సోదరుడు షెహ్‌బజ్‌ బడేషా సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. చివరిగా సిద్ధార్థ్‌కు వీడ్కోలు చెబుతూ ఓ ట్వీట్‌ చేశాడు.

చదవండి: భావోద్వేగం: ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనుకున్న ‘సిద్‌నాజ్’

‘మేరా షేర్‌. నువ్వు ఎప్పుడు మాతోనే ఉన్నావు. ఉంటావు కూడా. అందుకే నీకు నివాళి ఇవ్వాలనుకోవడం లేదు. ఎందుకంటే నీలా ఉండటానికి నేను ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం ఇదే నా కల. త్వరలోనే ఈ కలను నిజం చేస్తా. నీకు ఎప్పటికీ నివాళి తెలుపలేను. లవ్‌ యూ’ అంటూ షెహ్‌బజ్‌ తన స్నేహితుడిగా హృదయపూర్వక నివాళి అర్పించాడు. కాగా బిగ్‌బాస్‌ 13 సీజన్‌లో షెహనాజ్‌తో సిద్ధార్థ్‌ ప్రేమాయణం సిద్‌నాజ్‌గా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే షెహ్‌బజ్‌ తొలిసారిగా సిద్ధార్థ్‌ను బిగ్‌బాస్‌ హౌజ్‌లో కలుసుకున్నాడు. షెహనాజ్‌, సిద్ధార్థ్‌ల రిలేషన్‌తో వీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా మారారు. ఇక వీరి రిలేషన్‌లో సోదరి షెహనాజ్‌కు షెహ్‌బజ్‌ ఎప్పుడు మద్దతుగా ఉన్నాడు. కాగా సిద్ధార్థ్‌ అంత్యక్రియలకు షెహనాజ్‌ గిల్‌, ఆమె తల్లి కూడా హజరైన సంగతి తెలిసిందే. కారులో షెహనాజ్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే పక్కనే షెహ్‌బజ్‌ ఆమెను ఓదార్పునిస్తూ కనిపించాడు. 

చదవండి: సిద్ధార్థ్‌ శుక్లా అంత్యక్రియలు: కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న షెహనాజ్‌

మరిన్ని వార్తలు