Shehnaaz Gill: షెహనాజ్‌ పరిస్థితి ఏమీ బాగోలేదు

2 Sep, 2021 20:23 IST|Sakshi

Shehnaaz Gill Not Fine: అతడి పేరును పూర్తిగా పలికేలోపు ఆమె ఎదుట వాలిపోయేవాడు. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ చేయి పట్టుకుని నడిపించేవాడు. అన్ని సమయాల్లోనూ అండదండగా నిలిచాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో షెహనాజ్‌ గిల్‌కు అన్నీ తానై నిలబడ్డాడు యువ నటుడు సిద్దార్థ్‌ శుక్లా. కానీ ఇప్పుడు తన ప్రియురాలిని అర్ధాంతరంగా విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. టాలెంటెడ్‌ యాక్టర్‌ సిద్దార్థ్‌ ఇక లేడన్న విషయాన్ని సాధారణ ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు.

అలాంటిది అతడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన షెహనాజ్‌.. సిద్దార్థ్‌ మరణాన్ని ఎలా తట్టుకోగలుగుతుంది? ప్రస్తుతం తన పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్తున్నాడు ఆమె తండ్రి సంటోఖ్‌ సింగ్ సుఖ్‌. తాజాగా అతడు ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'సిద్దార్థ్‌ చనిపోయాడన్న విషయాన్ని నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాకు మాటలు రావడం లేదు. నా కూతురు షెహనాజ్‌తో మాట్లాడాను. ఆమె పరిస్థితి అస్సలు బాగోలేదు. నా కొడుకు షెబాజ్‌ ఆమెను చూసుకోవడానికి ముంబై వెళ్లాడు. నేను కూడా తన దగ్గరకు వీలైనంత త్వరగా వెళ్తాను' అని చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ షెఫాలీ తన స్నేహితురాలైన షెహనాజ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడటానికి ప్రయత్నించగా ఆమె ఫోన్‌ స్విచాఫ్‌ వచ్చినట్లు తెలిపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు