మా కష్టానికి తగిన ఫలితం దక్కింది : 'శేఖర్‌' నిర్మాత

22 May, 2022 09:15 IST|Sakshi

రాజశేఖర్‌ హీరోగా, శివానీ రాజశేఖర్, ఆత్మీయా రాజన్, ముస్కాన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. వంకాయల పాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజైంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నిర్మాత బొగ్గరం శ్రీనివాస్‌తో నాకు ఉన్న పరిచయం వల్ల ‘కార్తికేయ’ సినిమాకు తనతో ఇన్వెస్టర్‌గా చేరాను.ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నిర్మించాను.

ఇక ‘శేఖర్‌’ విషయానికి వస్తే.. రాజశేఖర్‌గారు నా ఫేవరెట్‌ హీరో. అందుకే ఆయన చేసిన ‘గరుడవేగ’ సినిమాతో ట్రావెల్‌ చేశాను. మలయాళ ‘జోసెఫ్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేద్దామని జీవితగారు చెప్పడంతో నేనూ ‘జోసెఫ్‌’ చూశాను. నచ్చి ‘శేఖర్‌’ సినిమాకు నిర్మాతగా ఉన్నాను. రాజశేఖర్‌గారు అద్భుతంగా నటించారు. జీవితగారు బాగా తీశారు. దాదాపు 300 థియేటర్స్‌లో రిలీజ్‌ చేశాం. సినిమా బాగుందని, మంచి సందేశం ఇచ్చారని ప్రేక్షకులు అభినందిస్తుంటే మా కష్టానికి తగిన ఫలితం దక్కిందని హ్యాపీగా ఉంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు