‘విలాసవంతమైన ఇల్లు.. నీకింత డబ్బు ఎక్కడిది’

23 Feb, 2021 20:48 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు శేఖర్‌ సుమన్‌కు సోషల్‌ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. విలాసవంతమైన తన ఇంటికి సంబంధించిన ఫొటోలపై ఓ నెటిజన్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘అంతగా అవకాశాలు లేకపోయినా, నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది’’ అని ట్రోల్‌ చేశాడు. ఇక ఇందుకు శేఖర్‌ కూడా గట్టిగానే బదులిచ్చాడు. కఠిన శ్రమకోర్చి, నిజాయితీగా, ఎంతో కష్టపడి సంపాదించాను అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. అంతేగాకుండా తన సినీ ప్రయాణానికి సంబంధించి వివిధ పత్రికల్లో ప్రచురితమైన ఆర్టికల్స్‌ ఫొటోలను కూడా షేర్‌ చేసి దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు.

కాగా నాటక రంగంలో ప్రవేశం ఉన్న శేఖర్‌ సుమన్‌ బుల్లితెరతో పాటు పలు బాలీవుడ్‌ సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ముంబైలో నివసించే అతడు కొన్నేళ్ల క్రితం తన కలల ఇంటిని అందంగా ముస్తాబుచేసుకున్నాడు. భార్యతో కలిసి తానే ఇంటీరియర్‌ డిజైన్‌ చేసుకున్నాడు. ఈ విషయం గురించి శేఖర్‌ సుమన్‌ ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘నీకు ప్రతిభ ఉండి, హార్డ్‌వర్క్‌ చేయగలిగే సామర్థ్యంతో పాటు ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే కచ్చితంగా ఒక అందమైన, విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకోవచ్చు. నెగిటివిటికి ఎంత దూరంగా ఉంటే మనసుకు అంత ప్రశాంతంగా ఉంటుంది’’ అని తనను ట్రోల్‌ చేసేవారికి కౌంటర్‌ ఇచ్చాడు.  

చదవండిబాలీవుడ్‌ ఫేక్‌ అంటున్న ప్రముఖ నటుడు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు