‘సాజిద్‌ ఖాన్‌ బలవంతం చేశాడు’

20 Jan, 2021 11:57 IST|Sakshi

బాలీవుడ్‌  నిర్మాత సాజిద్‌ ఖాన్‌ తమను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని అనేకమంది మహిళలు, 2018లో ఇండియాలో #MeToo (మీటూ) ఉద్యమం తారా స్థాయిలో ఉన్న సమయంలో ముందుకొచ్చి చెప్పుకున్న​ విషయం తెలిసిందే. బాధితుల్లో నటీమణులు సోనాలి చోప్రా, రాచెల్‌ వైట్‌, ఓ జర్నలిస్టు కూడా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి దివంగత నటి జియా ఖాన్‌, బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా కూడా చేరారు. గతంలో నిర్మాత సాజిద్‌ ఖాన్‌ తన సోదరిని వేధించాడని జియా చెల్లి కరిష్మా తాజాగా సంచనల వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నటి షెర్లిన్‌ కూడా ఈ తరహాలో నిర్మాత తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేశారు. 2005లో సాజిద్‌ ఖాన్‌ను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ట్విటర్‌ వేదికగా.. ‘'నా తండ్రి మరణించిన తర్వాత నేను అతనిని ఏప్రిల్ 2005 లో కలిశాను. కొద్ది రోజుల తరువాత అతను తన ప్రైవేట్ భాగాన్ని ప్యాంటు నుంచి తీసి చూపిస్తూ దాన్ని ఆస్వాధించాలని నన్ను కోరాడు.నేను తనను కలిసిన సందర్భం వేరు. కానీ అతను చెప్పిన మాటలు వేరు. ఆ సమయంలో ఎంత నరకం అనుభవించానో నాకు ఇంకా గుర్తుంది.’ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సాజిద్‌ ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో గతేడాది విడుదలైన  'హౌస్‌ఫుల్ 4' దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
చదవండి: ‘కేరింత’ నటుడుపై చీటింగ్‌ కేసు..

కాగా జియా ఖాన్ చనిపోయి ఏడేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమె మరణం గురించి మిస్టరీ వీడడం లేదు. జూన్ 3, 2013న ముంబైలోని తన నివాసంలో జియా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్‌లో జియాను కొందరు మానసికంగా వేధించారని ఈమె సోదరి కరిష్మా (చెల్లి) సంచలన వ్యాఖ్యలు చేసింది. జియా ఖాన్‌ డాక్యూమెంటరీ లండన్‌లో ఇటీవల విడుదలైంది.  ఓ ప్రముఖ ఛానెల్ ఈమె మరణంపై డెత్ ఇన్ బాలీవుడ్ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది.  ఈ సందర్భంగా జియా చనిపోయే ముందు ఆమెను ఎంత వేధించారో, ఎంత బాధపడిందో తెలుపుతూ జియా సోదరి  ఈ వ్యాఖ్యలు చేసింది. హౌజ్ ఫుల్ సినిమా సమయంలో తనను వేదనకు గురి చేశారని తెలిపింది.  సినిమా షూటింగ్ సమయంలో సాజిద్‌ ఖాన్‌ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడని వాపోయింది. చదవండి: ఆసుపత్రి పాలైన 'ఆర్ఆర్ఆర్' భామ..

ముఖ్యంగా షూటింగ్‌లో జియా స్క్రిప్ట్‌ చదివే సమయంతో.. టాప్, లో దుస్తులు తీసేయాలని సాజిద్‌ తనను బలవంతం చేశాడని, అది తలుచుకుని ఇంటికి వచ్చి ఏడ్చేసిందని చెప్పుకొచ్చింది.  ‘ఆ సినిమాతో నాకు కాంట్రాక్ట్‌ ఉంది. అక్కడి నుంచి వెళ్లిపోతే నాపై కేసు పెట్టవచ్చు. ఒకవేళ వెళ్లకుంటే నేను లైంగిక వేధింపులకు బలైపోతాను. ఇది ఓడిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.’ అని తన సోదరి కన్నీరు పెట్టుకున్నట్లు గుర్తు చేసుకుంది. ఇక జియా సోదరి చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ కూడా స్పందించింది. సాజిద్ ఖాన్ అలాంటి వాడే అంటూ ట్వీట్ చేసింది. ‘వాళ్లు జియాను చంపారు.. సుశాంత్‌ను కూడా చంపారు. అలాగే నన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు. అయినా కూడా వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతారు. ఎందుకంటే ఆ మాఫియా వాళ్లకు పూర్తి మద్దతుగా ఉంది. ప్రతి సంవత్సరం వాళ్లు ఇంకా బలంగా మారుతున్నారు. ప్రపంచం ఆదర్శంగా లేదని తెలుసుకోండి’ అంటూ వ్యాఖ్యలు చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు