మాల్దీవుల్లో భర్తతో ‘సాగర కన్య’

25 Feb, 2021 17:57 IST|Sakshi

తరుచూ షూటింగ్స్‌తో దేశవిదేశాలను చుట్టేసే సెలబ్రిటీలందరూ ఈ మధ్యకాలంలో మాల్దీవుల్లో సేదతీరితున్నారు. అక్కడి సముద్ర అందాలను ఆస్వాదిస్తూ తమ పార్ట్‌నర్స్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి బాలీవుడ్‌ నటి, ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ శిల్పా శెట్టి కూడా చేరిపోయింది. వెకేషన్‌ ట్రిప్‌ కోసం భర్త రాజ్‌ కుంద్రాతో కలిసి మాల్దీవుల్లో చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది ఈ యోగా బ్యూటీ. సముద్రతీరంలో ఇసుక తిన్నెలపై బికినీతో అందాలను ఆరబోస్తూ.. సాగరకన్యల్లా కనిపిస్తున్న శిల్పా శెట్టి ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నిజంగానే సాగరకన్యలా ఉన్నారంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఇక శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా సైతం మాల్దీవుల ఫోటోలను ఫేర్‌ చేస్తూ..లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌తో స్వర్గంలో ఉన్నామంటూ శిల్పాశెట్టితో దిగిన ఫోటోలను పోస్ట్‌ చేశారు.  శిల్పాశెట్టి 2009లో రాజ్‌ కుంద్రాను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి కుమారుడు వియాన్‌, కుమార్తె సమీషా(సరోగసీ ద్వారా కలిగిన సంతానం) ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత దాదాపు 13 ఏళ్ల పాటు సినిమాలకు గుడ్‌ డై చెప్పిన శిల్పా శెట్టి.., నిక‌మ్మ, హంగామా 2 చిత్రాలతో రీఎంట్రీ ఇస్తుంది. పోస్ట్‌ ప్రొడక‌్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉన్నాయి. 

చదవండి : ‘శ్రీదేవి తరువాత ఆ ఘనత నాకే సాధ్యం’
(దివ్య భారతి చేజార్చుకున్న పెద్ద సినిమాలివే)

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు