జైలులో భర్త.. పండగ వేడుకల్లో శిల్పాశెట్టి

8 Sep, 2021 17:57 IST|Sakshi

Shilpa Shetty Brought Home an Idol of Lord Ganesha: ప్రస్తుతం శిల్పా శెట్టి, ఆమె కుటుంబం గడ్డు పరిస్థితులను చూస్తోంది. శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇటీవల పోర్నోగ్రఫీ కేసులో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో శిల్పా ఇమేజ్‌ డ్యామేజవడంతో ఆమె మీడియా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదు. అంతేగాక 15 రోజుల పాటు ఇంట్లోనే ఉంది. షూటింగ్‌లకు కూడా హాజరు కాని శిల్పా ఇటీవల బయటకు వచ్చి తిరిగి సెట్స్‌లో సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా వినాయకచవితి పండగ సందర్భంగా ఆమె వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళుతున్న వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

చదవండి: Shilpa Shetty: 'శిల్పా శెట్టి దంపతులు నా డబ్బుతో పోర్న్‌ వీడియోలు తీశారు'

ప్రతి ఏడాదిలాగే శిల్పా ఈసారి కూడా వినాయకుడి ప్రతిష్టిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతిసారి శిల్పా తన కుమారుడు వియాన్‌, భర్త రాజ్‌కుంద్రా కలిసి విగ్రహాన్ని కొనుగోలు చేసి ఆటా పాటలతో అడంబరంగా ఇంటికి తీసుకుని వెళ్లేది. కానీ ఈ సారి ఆమె తన పనివారితో వచ్చి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసింది. అంతేగాక గణపతి బప్ప మోరియా అంటూ అందరితో కలిసి ఆడంబరంగా విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్లింది. చాలా రోజుల తర్వాత శిల్పా ఇలా బయటకు రావడంతో మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. ఆమె చుట్టూ చేరి ఫొటోలను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

చదవండి: షాకింగ్‌.. నటిని బంధించి రూ.6 లక్షలు దోచుకెళ్లారు!

అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ‘భర్త జైలు ఉన్నప్పటికీ కుటుంబ సంప్రదాయాన్ని మాత్రం శిల్పా మరవడం లేదు’ అని కొందరు నెటిజన్లు ప్రశంసించారు. ‘భర్త జైలు పాలైనా శిల్పా మాత్రం సంతోషంగా పండగ చేసుకుంటోంది’ అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఇటీవల శిల్పా శెట్టి, ఆమె భర్త మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్‌ గోయెల్‌ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశారని, ఈ డబ్బును అడల్ట్‌ మూవీస్‌ తీసేందుకు ఉపయోగించారని ఆరోపించాడు. స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బు తీసుకుని, వాటి ద్వారా పోర్న్‌ వీడియోలు తీశారని తీవ్ర ఆరోపణలు చేశాడు.

A post shared by Instant Bollywood (@instantbollywood)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు