Shilpa Shetty Vanity Van: ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రూమ్‌ను తలపిస్తున్న శిల్పాశెట్టి వ్యానిటీ వ్యాన్‌

8 Jun, 2022 20:36 IST|Sakshi

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి బర్త్‌డే నేడు (జూన్‌ 8). ఈ రోజు ఆమె 47వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తనకు తానే ఓ ప్రత్యేకమైన గిఫ్ట్‌ ఇచ్చుకుంది. లగ్జరీ వ్యానిటీ వ్యాన్‌ను తన సొంతం చేసుకుంది. బ్లాక్‌ కలర్‌లో ఉన్న ఈ వ్యాన్‌లో సకల సదుపాయాలు ఉండేలా చూసుకుంది. కిచెన్‌, హెయిర్‌ వాష్‌ రూమ్‌, యోగా డెక్‌ సహా అన్నింటినీ అమర్చుకుంది. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే శిల్పా ప్రయాణం చేసేటప్పుడు సమయం వృథా చేయకుండా యోగా చేసేందుకే యోగా డెక్‌ను అరేంజ్‌ చేసుకుందట. ఇక ఈ వాహనానికి ముందు భాగంలో ఎస్‌ఎస్‌కే అనే అక్షరాలు ఉన్నాయి. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ గదికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆమె వ్యానిటీ వ్యాన్‌ ఉంది.

ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన నికమ్మ చిత్రం జూన్‌ 17న రిలీజవుతోంది. అలాగే రోహిత్‌ శెట్టి ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌తో త్వరలో ఓటీటీలోనూ అడుగు పెట్టనుంది. ఇప్పటివరకు అజయ్‌ దేవ్‌గణ్‌ (సింగం), రణ్‌వీర్‌ సింగ్‌ (సింబా), అక్షయ్‌ కుమార్‌ (సూర్యవంశి)లను పోలీస్‌ ఆఫీసర్స్‌గా చూపించిన రోహిత్‌ శెట్టి ఈసారి శిల్పాశెట్టిని పోలీస్‌గా వెండితెరపై ప్రజెంట్‌ చేయనున్నాడు.

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

చదవండి: రూ.40 వేల ఖరీదైన టీ షర్ట్‌ ధరించిన కరీనా, వెరీ చీప్‌ టేస్ట్‌ అంటున్న నెటిజన్లు
నాన్న టార్చర్‌ పెడుతున్నాడు.. అభిమాని కష్టాలకు చలించిపోయిన హీరో

మరిన్ని వార్తలు