రాజ్‌కుంద్రాతో శిల్పా ఇంటికి చేరుకున్న పోలీసులు

23 Jul, 2021 17:32 IST|Sakshi

 శిల్పాశెట్టిని ప్రశ్నించనున్న పోలీసులు

 కుంద్రా పోర్న్‌ యాప్‌కు 20 లక్షల మంది సబ్‌స్రైబర్లు

ముంబై : పోర్నోగ్రఫీ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌కుంద్రా కేసు మరో మలుపు తిరిగింది.  ముంబై జుహూలోని శిల్పాశెట్టి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వారి వెంట రాజ్‌కుంద్రా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన మరింత లోతుగా విచారించేందుకు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు శిల్పాశెట్టిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిని ఏ క్షణమైనా అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. శిల్పాశెట్టి..వియాన్‌ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు. ఇటీవలె అంధేరి వెస్ట్‌లోని వియాన్‌ కార్యాలయానిపై దాడిచేసిన పోలీసులు భారీగా పోర్న్‌ వీడియోల డేటాను సేకరించారు.


అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్‌ అయిన కుంద్రా పోలీసు కస్టడీని ముంబై  మేజిస్ట్రేట్ జూలై 27వరకు పొడిగించిన సంగతి తెలిసిం‍దే.ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కుంద్రా నోరు విప్పడం లేదని తెలుస్తుంది. దీంతో కేసు దర్యాప్తులో భాగంగా శిల్పాను ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్‌కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్  మిలింద్ భరంబే గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఏడాదిన్నరలో వంద పోర్న్‌ వీడియోలు తయారు చేసినట్లు కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కుంద్రా పోర్న్‌ యాప్‌కు 20 లక్షల మంది సబ్‌స్రైబర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు