మహేశ్‌ బాబు SSMB28 సినిమాలో శిల్పాశెట్టి ?

14 May, 2021 08:11 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’. ఈ మూవీ అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచే మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ రాబోతున్న సినిమా ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో  ‘అతడు’  ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని ఓ కీలకపాత్ర పాత్రం కోసం బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

త్రివిక్రమ్‌ సినిమాల్లో కీలకమైన పాత్రల కోసం సీనియర్‌ స్టార్‌ హీరోయిన్లను తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అలా నదియా, ఖుష్బూ, స్నేహ వంటి హీరోయిన్లు త్రివిక్రమ్‌ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28లో శిల్పాశెట్టి అయితే బావుంటుందని మూవీ మేకర్స్‌ అభిప్రాయపడుతున్నారట.

ఇక ఈ సినిమాలో మహేశ్‌ సరసన ఇప్పటికే పూజా హెగ్డె ఎంపికైన తెలిసిందే. మరో హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంతో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మహేశ్‌ నటిస్తున్నారు. ఇటీవల దుబాయ్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. 

చదవండి : SSMB28: స్టోరీ అవుట్‌, ఆ సినిమాలో మహేశ్‌ పాత్రే టైటిల్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు