అటు పోర్నోగ్రఫీ కేసు : ఇటు వార్తల్లోకి శిల్పాశెట్టి తల్లి

29 Jul, 2021 19:08 IST|Sakshi

 రూ. 1.6 కోట్ల చీటింగ్‌ కేసు నమోదు చేసిన శిల్పాశెట్టి తల్లి

తప్పుడు పత్రాలతో  భూమిని అమ్మాడంటూ ఫిర్యాదు

సుధాకర్ ఘారేపై కేసు నమోదు చేసిన పోలీసులు

సాక్షి, ముంబై:  బాలీవుడ్‌ నటి  శిల్పాశెట్టి,  వ్యాపార వేత్త రాజ్‌కుంద్రా దంపతుల పోర్నోగ్రఫీ కేసు వివాదం కొనసాగుతుండగానే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. శిల్పాశెట్టి తల్లి సునంద శెట్టి వార్తల్లో నిలిచారు. ఒక భూమి కొనుగోలు విషయంలో రూ .1.6 కోట్ల మేర మోసపోయానంటూ చీటింగ్‌ కేసు నమోదు చేశారు. 

ముంబై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు సుధాకర్ ఘారే నకిలీ పేపర్లతో  ఒక ల్యాండ్‌ను విక్రయించారని సునందా ఆరోపించారు.  తప్పుడు పత్రాలతో మోసం చేశాడని,  రూ .1.6 కోట్లకు భూమిని విక్రయించాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో  నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. 

రాజ్‌ కుంద్రా బెయిల్‌ మరోసారి తిరస్కరణ
బెయిల్‌ విషయంలో కుంద్రాకు మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. తన అరెస్ట్‌ను, పోలీసు కస్టడీని వ్యతిరేకిస్తూ కుంద్రా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అనంతరం విచారణను శనివారానికి వాయిదా వేసింది. కాగా అశ్లీల చిత్రాలను తయారు  చేస్తున్నారన్న ఆరోపణలపై  జూలై 19న పోలీసులు రాజ్‌ కుంద్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో కుంద్రాను కీలక కుట్రదారుడిగా ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు పేర్కొన్నారు. అశ్లీల చిత్రాలను హాట్‌ షాట్స్‌ యాప్‌ ద్వారా రిలీజ్‌ చేసి, కోట్ల రూపాయలు దండుకున్నా డనేది కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసులో శిల్పా శెట్టికి క్లీన్‌చిట్‌ లభించే అవకాశాలు కూడా కనిపించడంలేదు. మరోవైపు ఈ కేసులో కుంద్రా కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు అప్రూవర్‌లుగా మారడంతో మరింత ఉచ్చు బిగుస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధం ఉన్న వ్యక్తుల ఖాతాల్లోని లావాదేవీలపై దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు