'కుంద్రా-శిల్పాశెట్టి కహానీలో 3 హ్యాండ్‌ బ్యాగులు' స్టోరీ ఏంటంటే..

24 Jul, 2021 17:44 IST|Sakshi

Raj kundra-Shilpa shetty love story: రాజ్‌కుంద్రా.. గత కొన్నిరోజుల నుంచి ఈ పేరు దేశ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. మీడియా, వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలోనూ కుంద్రా భాగోతంపై జోరుగా చర్చ నడుస్తుంది. లండన్‌కు చెందిన  రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ కావడంతో సినీ ఇండస్ర్టీ ఒక్కసారిగి ఉలిక్కిపడింది. ఇక భర్త అరెస్ట్‌ అనంతరం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిన శిల్పా తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకప్పుడు శాలువాలు అమ్మిన రాజ్‌కుంద్రా అప్పటి స్టార్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టిని ఎలా వల్లో వేసుకున్నారన్నదానిపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తుంది. 

రాజ్‌ కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్‌గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. దీంతో 18 ఏళ్ల వయసులో దుబాయ్‌ అక్కడి నుంచి నేపాల్‌ వెళ్లిన కుంద్రా..మొదట శాలువాల బిజినెస్‌ చేశాడు.  అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్‌కు చెందిన ఫ్యాషన్‌ హౌజ్‌ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత  కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్‌లో అడుగుపెట్టి లాభాలు ఆర్జించాడు. ఆ సమయంలోనే బాలీవుడ్‌ సినిమాలకు ఫైనాన్సింగ్‌ చేస్తూ సంజయ్‌ దత్‌, అక్షయ్‌ కుమార్‌ లాంటి స్టార్లలతో పరిచయాలు ఏర్పరుచుకున్నాడు.


ఈ క్రమంలోనే ఓ డీల్‌ విషయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా రాజ్ కుంద్రాను శిల్పా మొదటిసారి కలిసిందట. ఆమె నవ్వు, అందానికి తొలిచూపులోనే ఇంప్రెస్‌ అయిన కుంద్రా శిల్పాకు దగ్గరయ్యేందుకు చాలానే ప్రయత్నాలు చేసేవాడట. అప్పటినుంచి సందర్భం లేకున్నా ఆమెకు కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇవ్వడం మొదలుపెట్టాడట.  ఓసారి శిల్పాకు ఇష్టమైన కలర్ ఏంటో తెలియక ఒకే బ్రాండ్‌ ఉన్న ఖరీదైన మూడు బ్యాగులను వేరే వేరు రంగులతో ఆమెకు బహుమతిగా పంపించాడట. ఇది చూసి శిల్పా షాక్‌ అయ్యిందట. అంతేకాకుండా ఆ సమయంలో లండన్‌లోనే బిజినెస్‌ వ్యవహారాలు చూసుకుంటండంతో పెళ్లి అయితే లండన్‌ వెళ్లడం ఇష్టం లేక ఇలాంటివి ఆపాల్సిందిగా శిల్పా కుంద్రాను కోరింది. దీంతో ఆమెను లండన్‌కు తీసుకెళ్లకుండా కుంద్రానే ముంబైలో ఓ ఇల్లు తీసుకున్నాడట. 

ఈ విషయాన్ని స్వయంగా శిల్పా ఓ ఇంటర్వ్యూలోనూ రివీల్‌ చేసింది. అలా కుంద్రా తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ఇంప్రెస్‌ అయినట్లు చెప్పుకొచ్చింది. ఇక వీరుద్దరు కొన్నాళ్లు డేటింగ్‌ అనంతరం 2009లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.  ఇక పెళ్లికి ముందు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా సత్తా చాటిన శిల్పా.. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు హంగామా-2 చిత్రం ద్వారా మరోసారి కం బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే భర్త అరెస్ట్‌ శిల్పాకు ఊహించని షాక్‌ ఇచ్చింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు