బాలీవుడ్‌లో కరోనా కలకలం.. నమ్రత సోదరికి పాజిటివ్‌

30 Dec, 2021 17:43 IST|Sakshi

దేశంలో కరోనా మళ్లీ విజృంభించింది. వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. సాధారణ ప్రజలు మొదలు.. సెలబ్రిటీల వరకు కరోనా ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌ హీరో అర్జున్‌ కపూర్‌, టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, బాలీవుడ్‌ భామ కరీనా కపూర్‌, ఐటెం బ్యూటీ నోరా ఫతేహి తదితరులు కోవిడ్‌ బారిన పడగా.. తాజాగా మరో బాలీవుడ్‌ హీరోయిన్‌కి కరోనా సోకింది.

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. గత నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోని,  అన్ని నియమాలను పాటించండి’ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేసింది శిల్ప. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది.  
 

మరిన్ని వార్తలు