'కాసేదాన్‌ కడవులడా'  రీమేక్‌లో ప్రియా ఆనంద్‌

19 Jul, 2021 09:17 IST|Sakshi

చెన్నై: 1972లో విడుదలైన క్లాసిక్‌ కామెడీ చిత్రం కాసేదాన్‌ కడవులడా. ముత్తురామన్, లక్ష్మి నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అలాంటి చిత్రం ఇప్పుడు మళ్లీ రీమేక్‌ అవుతోంది. ఇందులో నటుడు మిర్చి శివ, నటి ప్రియా ఆనంద్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఆర్‌.కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణియం, ఛాయాగ్రహణం, కన్నన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు కన్నన్‌ వివరిస్తూ కాసేదాన్‌ కడవులడా చిత్ర రీమేక్‌ హక్కులను అధికార పూర్వకంగా పొంది దాని స్థాయికి తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు