Shiva Balaji-Madhumitha: శివబాలాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మధుమిత

4 Nov, 2021 13:12 IST|Sakshi

టాలీవుడ్‌ క్యుటెస్ట్‌ కపుల్స్‌లో శివ బాలాజీ, మధుమిత జంట ఒకటి. ఇద్దరూ సహా నటీనటులుగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో నటిస్తున్న క్రమంలో పరిచయం ఏర్పడి వీరిద్దరి మధ్య కొంతకాలానికి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. 2009 మార్చీలో 1న పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన ఇద్దరూ మ్యాచింగ్‌ దుస్తులు ధరించిన మ్యారీడ్‌ దోస్తుల్లా ఆకట్టుకుంటారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగ సందర్భంగా ఈ ‘బ్రైట్‌ కపుల్‌’  సాక్షితో టీవీ పంచుకున్న ముచ్చట్లివి..

శివబాలాజీ: నాకు కోపం ఎక్కువని మధు నన్ను పెళ్లి చేసుకోవడం వాళ్లింట్లో ఇష్టం లేదు. అయితే ఇప్పుడు అర్థం చేసుకున్నారు.
మధుమిత: పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నా కూడా పెళ్లయిన కొత్తలో ప్రతీ చిన్న విషయానికీ గొడవ పడేవాళ్లం. అయితే ఆ తర్వాత ఎలా ఉండాలో తెలుసుకున్నాం.
శివబాలాజీ: తను పప్పుచారు నుంచి పాయా దాకా అన్నీ అద్భుతంగా వండుతుంది.  
మధుమిత: ఇంటర్‌లో అన్నయ్య నుంచి వంటలు నేర్చుకున్నాను. నా దగ్గర నుంచీ తనకు నచ్చినవన్నీ తను (శివ) కూడా నేర్చుకున్నారు. శివబాలాజీ: పెళ్లయ్యాక సినిమాలు మానేయాలని మధు ఫ్యామిలీ డిసైడ్‌ అయింది. అయితే ఆలోచించమని నచ్చజెప్పా. అప్పుడు ఓకే అన్నప్పటికీ పెళ్లి తర్వాత పాత్రల విషయంలో పర్టిక్యులర్‌ అయిపోయింది.
మధుమిత: కరోనా టైమ్‌లో 3 నెలల పాటు ఫార్మ్‌లో గడిపేశాం.
శివబాలాజీ: నాకు చిన్నప్పటి నుంచీ వ్యవసాయం, నీళ్ల మధ్యలో ఇల్లు అంటే ఇష్టం. మధు వాళ్ల ఫ్యామిలీకి కూడా అదే హాబీ.
మధుమిత: అందరూ సేఫ్‌గా పండగ చేసుకోవాలని కోరుకుంటున్నాం.

మరిన్ని వార్తలు