Tuck Jagadish: 'ఓటీటీ వల్ల విజిల్స్, క్లాప్స్‌ మూమెంట్స్‌ని మిస్‌ అవుతాం'..

7 Sep, 2021 07:54 IST|Sakshi

‘‘టక్‌ జగదీష్‌’ టైటిల్‌ చూడగానే కథ చాలా సరదాగా ఉంటుందనుకుంటారు. కానీ ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో ఉండే భావోద్వేగాలన్నీ ఉన్నాయి. తప్పకుండా మా సినిమా ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది’’ అని చిత్రదర్శకుడు శివ నిర్వాణ అన్నారు. నాని, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌లో విడుదలవుతోంది.

శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబం కథతో ఓ సినిమా చేయాలనేది నా కోరిక.. అది ‘టక్‌ జగదీష్‌’తో నెరవేరింది. ఈ సినిమా ఐడియాని నానీకి చెప్పినప్పుడు ‘చాలా బాగుంది, కథ రెడీ చెయ్‌.. చేద్దా’మన్నారు. ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యే కథ ఇది. ఓటీటీ వల్ల విజిల్స్, క్లాప్స్‌ మూమెంట్స్‌ని మిస్‌ అవుతాం. అయితే ఒక మైనస్‌ ఉన్నప్పుడు మరికొన్ని ప్లస్‌లు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ థియేటర్స్‌కి రాలేరు.. అదే ఓటీటీలో కుటుంబమంతా కలసి ఇంట్లోనే చూసే అవకాశం ఉండటం హ్యాపీ. నా తర్వాతి చిత్రం విజయ్‌ దేవరకొండ హీరోగా ఉంటుంది’’ అన్నారు. 

చదవండి : ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్‌
‘జోర్‌ సే’ అంటూ మాస్‌ స్టెప్పులతో అదరగొట్టిన మెగా మేనల్లుడు

మరిన్ని వార్తలు