Shiva Rajkumar: నా చేతులతో ఎత్తుకుని ఆడించా.. ఈ బాధలు ఎవరికీ రాకూడదు

2 Nov, 2021 07:22 IST|Sakshi
పునీత్‌తో శివ రాజ్‌కుమార్‌ (ఫైల్‌)

పునీత్‌ అన్న శివరాజ్‌ ఆవేదన  

సాక్షి, యశవంతపుర: ప్రముఖ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో ఆయన కుటుంబంతో పాటు లక్షలాది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కన్నుమూసి నాలుగురోజులు దాటింది. సోమవారం ఆయన పెద్దన్న, హీరో శివ రాజ్‌కుమార్‌ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పునీత్‌ మరణం మా కుటుంబానికి తీరని శోకం. నా చేతులతో ఎత్తుకుని ఆడించా. ఈ బాధలు ఎవరికీ రాకూడదు. పునీత్‌కు పాల శాస్త్రం చేయడం ఎంతవరకు సరి అనేది అర్థం కావడం లేదన్నారు. పాలశాస్త్రం తంతు ముగియగానే అభిమానులను కంఠీరవ స్టూడియోలో సమాధి వద్దకు అనుమతించటంపై సీఎంతో చర్చిస్తాన్నారు.  

చదవండి: (‘పునీత్‌’ కళ్లు నలుగురికి చూపునిచ్చాయి)

మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి  
పునీత్‌ రాజ్‌కుమార్‌ దేవునివంటివాడు అని ఇంటి సెక్యూరిటీ గార్డు రామచంద్రప్ప విలపించారు. ఇంత మంచి పేరు సంపాదించిన వ్యక్తిని దేవునిగా భావించాం. ఎవరైనా అభిమానులు ఇంటి వద్దకు వస్తే కసురుకోవద్దని చెప్పేవారు. మమ్మల్ని అన్నా అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఇక అభిమానులు కంఠీరవ స్టూడియో వద్ద సమాధిని చూడాలని పడిగాపులు కాస్తున్నారు. పోలీసులు వారిని అనుమతించడం లేదు. 

చదవండి: (పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్‌)

శివాజీప్రభు పరామర్శ  
పునీత్‌ కుటుంబాన్ని తమిళ సీనియర్‌ నటుడు శివాజీ ప్రభు సోమవారం పరామర్శించారు. తమ తండ్రి శివాజీ గణేశన్, కంఠీరవ రాజ్‌కుమార్‌లు మంచి స్నేహితులు. నేను శివరాజ్, రాఘవేంద్ర, పునీత్‌లు మంచి మిత్రులమని ఆయన చెప్పారు. పవర్‌ సినిమాలో పునీత్‌తో కలిసి నటించానన్నారు. పునీత్‌ తనను ఎప్పుడు ఆన్న అని పిలిచేవాడని తెలిపారు.    

మరిన్ని వార్తలు