Shiva Shankar Master: బాడీ లాంగ్వేజ్‌పై విమర్శలు.. మాస్టర్‌ పాత ఇంటర్వ్యూ వైరల్‌

29 Nov, 2021 14:30 IST|Sakshi

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివ శంకర్‌ మాస్టర్‌ కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1948 డిసెంబర్ 7న చెన్నైలో జన్మించిన మాస్టర్‌ చిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు. ఏడాది వయసులో ఓ ప్రమాదంలో వెనుముక తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ సంకల్ప బలంతో డ్యాన్స్‌ అవ్వాలనుకున్నారు. పట్టుదలతో డ్యాన్స్‌ నేర్చుకుని నృత్య దర్శకుడు అయ్యారు.

చదవండి: Shiva Shankar Master: శివ శంకర్‌ మాస్టర్‌ చివరి కోరిక ఏంటో తెలుసా?

‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత శివ శంకర్‌ మాస్టర్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు. ఈ క్రమంలో ఆయన జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. తన డ్యాన్స్‌తోనే ఎన్నో హావభావలను పలికించే మాస్టర్‌ 800లకు పైగా చిత్రాలకు పని చేశారు. అలాంటి మాస్టర్‌కు విమర్శలు తప్పలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్‌పై ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో ఓ ఇంటర్య్వూలో ఆయనపై వచ్చే విమర్శలకు ఓ ఇంటర్వ్యూలో మాస్టర్‌ తనదైన శైలి సమాధానం ఇచ్చి ట్రోలర్స్‌కు ఘాటుగా సమాధానం ఇచ్చారు.

చదవండి: రాజ్‌ తరుణ్‌ అంటే అసలు నచ్చదు.. అరియానా షాకింగ్‌ కామెంట్స్‌

ఓ ఇంటర్య్వూలో యాంకర్‌ తన బాడీ లాంగ్వేజ్‌పై వచ్చి కామెంట్స్‌కు మీ సమాధానం ఏంటని అడగ్గా.. అవన్ని నేను పట్టించుకోనని, వారు అన్నంత మాత్రాన నేను అది అయిపోయిను కదా. నాకంటే ప్రత్యేకమైన క్యారెక్టర్‌ ఉంది’ అంటూ సమాధానం ఇచ్చారు. అంతేగాక ఎవరూ నవ్వితే వారి పళ్లు బయట పడతాయి, ఓ డ్యాన్స్‌ మాస్టర్‌గా నేను ఇలాగే ఉంటాను. ఫైట్‌ మాస్టర్‌గా కూలింగ్‌ గ్లాస్‌ పెట్టుకని రఫ్‌గా ఉండను. నాలో కళానైపుణ్యం ఉంది. దానికి తగ్గట్టుగానే నేను ఉంటాను. ఎవరు ఏమని కామెంట్‌ చేసిన నేను పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చారు.

చదవండి: Shiva Shankar Master: వెన్నుముక గాయంతో 8 ఏళ్లు మంచానికే, డ్యాన్స్‌ మాస్టర్‌ ఎలా అయ్యారంటే..

ఇక తన ముఖంలో రౌద్రం, వినయం, భావోద్యేగం వంటి భావాలను తన ముఖంలో చూపిస్తూ ఇందులో నా ఆర్ట్‌ కనిపించిందా?, ఆడంగి తనం కనిపించిందా? అని తిరిగి యాంకర్‌ను ప్రశ్నించారాయన. ఇక మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసిన టీవీయే మీపై ఇలాంటి విమర్శలకు కారణమైందని ఎప్పుడైనా బాధపడ్డారా అనే ప్రశ్నకు.. ఆయన ప్రతి విషయానికి బాధపడుకుంటూ పోతే మనం జీవించలేమన్నారు. ‘నా మనసు మంచిదా? నేను మంచివాడినా? నాలో ఆర్ట్ ఉందా? ధన్యుడనా కాదా అనేదానిపైనే నా దృష్టి ఉంటుంది. నేను ఎటూ చూసిన, ఏం చేసిన, ఏడు నడిచినా అది నా కళ కోసమే, ఈ దారిలో నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అంతగా పట్టించుకోను’ అంటూ తనదైన శైలిలో శివ శంకర్‌ మాస్టర్‌ సమాధానం ఇచ్చి విమర్శకుల నోరు మూయించారు. 

మరిన్ని వార్తలు