ఓటీటీకి శివాని రాజశేఖర్‌ తమిళ చిత్రం అన్బరివు, ఆరోజే స్ట్రీమింగ్‌

6 Jan, 2022 08:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: హిప్‌ హాప్‌ ఆది కథానాయకుడిగా తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అన్బరివు. అశ్విన్‌ రామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సత్యజ్యోతి ఫిలిమ్స్‌ పతాకంపై టీజీ. త్యాగరాజన్‌ సమర్పణలో సెంథిల్‌ త్యాగరాజన్, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించిన ఈ చిత్రంలో నటి కశ్మిరా పర్దేశి, శివాని రాజశేఖర్‌ కథానాయికలుగా నటించారు.

చదవండి: నాకింకా 29 మాత్రమే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి

హిప్‌ హాప్‌ ఆదినే సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం(జనవరి 7) డిస్నీ ప్లస్‌ హట్‌ స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు ఆది మాట్లాడుతూ... ఇందులో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. చక్కని సందేశంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చెప్పారు. సత్య జ్యోతి వంటి ప్రముఖ సంస్థ ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం సంతోషంగా ఉందని అశి్వన్‌ రామ్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు