Shivarajkumar : రజనీకాంత్‌ సినిమాలో విలన్‌గా శివరాజ్‌కుమార్‌.. ఫోటో వైరల్‌

20 Nov, 2022 09:41 IST|Sakshi

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నాత్తే తరువాత నటిస్తున్న చిత్రం జైలర్‌. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పడయప్పా తరువాత నటి రమ్యకృష్ణ రజనీకాంత్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. అదే విధంగా నటుడు వసంత్‌ రవి, యోగిబాబు, వినాయగన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోకి తాజాగా కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ వచ్చారు. అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్న జైలర్‌ చిత్రం గత ఆగస్టు నెలలో ప్రారంభమైంది.

ఇటీవల కడలూర్‌ ప్రాంతంలో రెండో షెడ్యూల్‌ జరుపుకుంది. ఇప్పటికే 59 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఇటీవల విడుదలై జైలర్‌ చిత్రంపై అంచనాలను పెంచేసింది. చిత్రంలో తలైవా యాక్షన్‌ సన్నివేశాలు హైఓల్టేజ్‌లో ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. చిత్ర మేకింగ్‌ వీడియోను విడుదల చేయగా అది ట్రెండింగ్‌ అవుతోంది.

కాగా జైలర్‌ చిత్రంలో శివరాజ్‌ కుమార్‌ రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ కుటుంబంతో రజినీకాంత్‌కు ఎంతో అనుబంధం ఉంది. అలాంటిది జైలర్‌ చిత్రంలో రజనీకాంత్‌ను శివ రాజ్‌ కుమార్‌ ఢీ కొనే సన్నివేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ నెలలో విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ఇప్పటికే ప్రకటించింది.

మరిన్ని వార్తలు