కోలీవుడ్‌లో 'దొరసాని' జోరు..మూవీ రిలీజ్‌ కాకముందే

29 Jun, 2021 15:55 IST|Sakshi

‘దొరసాని’  చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్న శివాత్మికకు అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చిత్రంలో నటిస్తున్న శివాత్మక చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది‘ఆనందం విలయాడుమ్‌ వీడు’ సినిమాతో  కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.  గౌతమ్‌ కార్తిక్‌కి జోడిగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. అయితే మొదటి సినిమా విడుదల కాకముందే  కోలీవుడ్‌ నుంచి మరో ప్రాజెక్టుకు సైన్‌ చేసింది.

ఆర్‌ కార్తిక్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రేమకథా చిత్రంలో శివాత్మిక కథానాయికగా నటించనుంది. ఆమెతో పాటు రీతూవర్మ, అపర్ణబాలమురళి కూడా ఈ సినిమాలో నటించనున్నారు. రోడ్‌ జర్నీ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉండనుందని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టు గురించి శివాత్మిక అధికారికంగా ప్రకటించింది. నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది. అద్భుతమైన బృందంతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ శివాత్మిక తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా సంతోషం వ్యక్తం చేసింది.   

చదవండి : Shakuntalam: సమంత ఫస్ట్‌లుక్‌పై క్రేజీ అప్‌డేట్‌
పెళ్లికి రెడీ అయిపోయిన లవ్‌ బర్డ్స్ నయన్‌-విఘ్నేష్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు