శివాత్మిక రాజశేఖర్‌ ఆఫర్‌ను కొట్టేసిన మలయాళ కుట్టి!

8 Aug, 2021 17:21 IST|Sakshi

దొరసాని మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్‌. ప్రస్తుతం ఆమె తెలుగులో పంచతంత్రం మూవీతో పాటు పలు సినిమాలు చేస్తుంది. అలాగే ‘ఆనందం విలయదుం వీడు’ అనే మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉండగా శివాత్మిక సంబంధించిన ఓ వార్త ఫిలిం దునియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె చేతి నుంచి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ చేజారిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన కప్పెల మూవీని డెబ్యూ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ టీ రమేశ్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  సిద్దు జొన్నల గడ్డ, అర్జున్‌ దాస్‌ కీలక పాత్రలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో శివాత్మికను నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయతే ఈ తాజా బచ్‌ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్‌గా మలయాళ నటి అనికా సురేంద్రన్‌ను మేకర్స్‌ ఖరారు చేశారట. దీంతో శివాత్మిక మంచి గోల్డెన్‌ చాన్స్‌ మిస్‌ అయ్యిందంటూ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కాగా ప్రస్తుతం అనికా ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న కింగ్‌ నాగార్జున అక్కినేను చిత్రలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జయలలీత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘క్వీన్‌’ వెబ్‌సిరీస్‌లో టీనేజ్‌ జయలలితగా మెప్పించిన అనికా పలు సినిమాల్లో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కప్పెల రీమేక్‌తో ఆమె తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీ గత జులైలో ప్రారంభం అయ్యింది. తమిళంలో మ‌హ్మ‌ద్ ముస్తాఫా ద‌ర్వ‌క‌త్వంలో రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కించిన ఈ మూవీ  బాక్సాపీస్ వ‌ద్ద మంచి విజయం సాధించింది.  4 కోట్ల రూపాయల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 10 కోట్ల‌ రూపాయలకు పైగా క‌లెక్ష‌న్ల‌ను రాబట్టింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు