వైష్ణవ్‌ తేజ్‌ తొలి పారితోషికం ఎంతంటే?

25 Feb, 2021 10:02 IST|Sakshi

తొలి సినిమా ప్రభావం హీరోల మీద గట్టిగానే ఉంటుంది. అది హిట్టయిందంటే చాలు దర్శకనిర్మాతలు అతడితో కలిసి పని చేసేందుకు తహతహలాడుతుంటారు. ఒకవేళ ఫస్ట్‌ మూవీయే ఫ్లాప్‌ అయిందంటే ఆ హీరోతో సినిమా అంటేనే వెనకడుగు వేస్తారు. కానీ ఇక్కడ వైష్ణవ్‌ తేజ్‌ నటించిన మొట్టమొదటి సినిమా ఉప్పెనంత విజయాన్ని నమోదు చేసుకుని అతడికి స్పెషల్‌ క్రేజ్‌ తెచ్చిపెట్టింది. పైగా మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చాడన్న పేరు ఉండనే ఉంది. దీంతో అతడు తన క్రేజ్‌ను బాగానే క్యాష్‌ చేసుకుంటున్నాడు. ఇప్పటికే క్రిష్‌ డైరెక్షన్‌లో చేయబోయే సినిమాకు రూ.75 లక్షలు తీసుకోనున్నాడు.

అయితే ఉప్పెన రిలీజ్‌కు ముందే ఈ డీల్‌ కన్ఫార్మ్‌ అయింది. అలాగే నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ కాంబినేషన్‌లో రానున్న చిత్రానికి ఏకంగా రూ.2.5 కోట్లు తీసుకుంటున్నాడట. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశి బాబు మూడో సినిమాకే ఇంత పారితోషికం తీసుకుంటున్నాడా? అని షాకవుతున్నారు. ఈ క్రమంలో అతడి తొలి రెమ్యునరేషన్‌ ఎంత ఉండొచ్చని గుసగుసలు పెడుతున్నారు. అయితే సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తొలి సినిమా ఉప్పెన కోసం అతడు అక్షరాలా రూ.50 లక్షలు తీసుకున్నాడట. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీగా మెగా హీరో అంటే ఆ మాత్రం ఉంటుందిలే అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

చదవండి: ‘ఉప్పెన’ ఎలా ఉందో ఒకే ముక్కలో తేల్చేసిన మహేశ్‌

రామ్‌ చరణ్‌ రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు