అఖిల్‌ అమెరికన్‌ నటుడంటోన్న గూగుల్‌! షాక్‌లో ఫ్యాన్స్‌

8 Apr, 2021 17:01 IST|Sakshi

నేడు(గురువారం) అక్కినేని వారసుడు అఖిల్‌ బర్త్‌డే. దీంతో పలువురు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సక్సెస్‌కు హార్డ్‌వర్క్‌ను మించిన ఫార్ములా లేదు. నువ్వు ఆ నీ కష్టాన్ని నమ్ముకున్నావని  నేను  నమ్ముతున్నాను. ఎన్నో విజయాలు నీ సొంతం కావాలని, నీ కలలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే.. అని ట్వీట్‌ చేశాడు చిరంజీవి. దీనికి అఖిల్‌ బదులిస్తూ.. మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి థ్యాంక్స్‌ అనే చిన్నపదం సరిపోదు. నేను నా వంతు శ్రమిస్తూనే ఉంటా. థ్యాంక్స్‌ యూ వెరీ మచ్‌ సర్‌ అని రాసుకొచ్చాడు.

సిసింద్రీతో కెరీర్‌ మొదలు పెట్టిన అఖిల్‌ ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. కానీ ఒక్క హిట్‌ కూడా పడలేదు. దీంతో ఎలాగైనా సక్సెస్‌ సాధించాలన్న కసితో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ బాగానే కష్టపడుతున్నాడు. అయితే అఖిల్‌ గురించి గూగుల్‌ ఓ కొత్త విషయాన్ని బయటపెట్టింది. అఖిల్‌ తెలుగు యాక్టర్‌ కాదంటోంది. అతడు అమెరికన్‌ యాక్టర్‌ అని చెప్తోంది గూగుల్‌ వికీపీడియా. నిజానికి అఖిల్‌ అమెరికాలోనే పుట్టాడు. కానీ తను పెరిగింది మాత్రం ఇక్కడే. పైగా నటించింది కూడా తెలుగు చిత్రాల్లోనే. కానీ వికీపీడియా మాత్రం అతడిని అమెరికన్‌ నటుడిగా గుర్తించడంతో షాకవుతున్నారు అభిమానులు. 

ఇదిలా వుంటే అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం "మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌". అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ జూన్‌ 19న విడుదల కానుంది. మరోవైపు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో సీక్రెట్‌ ఏజెంట్‌గా నటిస్తున్నాడు అఖిల్‌. గురువారం అఖిల్‌ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సిగరెట్‌ చేతిలో పట్టుకుని రఫ్‌ లుక్‌లో కనిపిస్తున్నాడీ యంగ్‌ హీరో.

చదవండి: ఏజెంట్‌’ ఫస్ట్‌లుక్‌.. సూపర్ స్టైలిష్‌గా అఖిల్‌‌

అల్లు అర్జున్‌ కెరీర్‌లో భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలు..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు