హిందీ ఆమె

15 Aug, 2020 02:47 IST|Sakshi
శ్రద్ధాకపూర్‌

అమలాపాల్‌ ముఖ్యపాత్రలో నటించిన లేడీ ఓరియంటెడ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్‌ చేయటానికి రెడీ అవుతున్నారు ఆ చిత్రదర్శకుడు రత్నకుమార్‌. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. హిందీ రీమేక్‌లో కథానాయికగా శ్రద్ధాకపూర్‌ నటిస్తారని సమాచారం. మరి ఒరిజినల్‌ వెర్షన్‌లో అమలా చేసిన బోల్డ్‌ సీన్‌ (నగ్నంగా నటించారు) ను రీమేక్‌లో శ్రద్ధాకపూర్‌  చేస్తారా? అనేది చూడాలి. బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా