వర్మ సినిమాను 267 సార్లు చూశాను: హీరోయిన్‌

19 Apr, 2021 08:26 IST|Sakshi

ఒక సినిమాను ఎన్నిసార్లు చూస్తాం? ఒకటీ రెండుసార్లు.. బాగా నచ్చిందంటే ఓ పది సార్లు చూస్తాం. ఇక వీరాభిమానులైతే 30 నుంచి 50 సార్లైనా చూస్తారు. కానీ ఓ నటి మాత్రం ఒకట్లు, పదులు కాదు, ఏకంగా వందల సార్లు ఒకే సినిమాను చూసిందట. జోష్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి శ్రేయా ధన్వంతరి 'ది ఫ్యామిలీ మ్యాన్‌', 'స్కామ్‌ 1992' వెబ్‌ సిరీస్‌లతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఆమెకు తెలుగు సినిమాలంటే మక్కువ ఎక్కువ.

ఈ క్రమంలో రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించినన 'క్షణక్షణం' చిత్రాన్ని ఆమె ఏకంగా 267 సార్లు చూసిందట. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. తెలుగులో నా ఫేవరెట్‌ సినిమాను 267వ సారి చూశాను. ఇందులో హీరో దగ్గుబాటి వెంకటేష్‌, పరేశ్‌ రావల్‌, శ్రీదేవి అద్భుతంగా నటించారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి బీజీఎమ్‌ కూడా సూపర్‌గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టవని చెప్తున్నారు.

చదవండి: బుట్టబొమ్మ ఇంట్లో బర్త్‌డే వేడుకలు

'దిల్‌ బేచారా'లో క్యాన్సర్‌ రోగిగా కనిపించింది ఈవిడే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు