తల్లి కాబోతున్న ప్రముఖ గాయని

4 Mar, 2021 10:24 IST|Sakshi

శుభవార్త చెప్పిన స్టార్‌  సింగర్‌

బేబీ శ్రేయాదిత్య  కమింగ్‌ : శ్రేయా ఘోషాల్

సాక్షి,ముంబై: ప్రముఖ గాయని శ్రేయా ఘోషాల్‌ శుభవార్త అందించారు. బేబీ శ్రేయాదిత్య  కమింగ్‌ అంటూ  స్వయంగా  మధుర క్షణాలను  ఫ్యాన్స్‌కు షేర్‌ చేశారు. తమ జీవితంలో ఈ సరికొత్త అధ్యాయాన్ని పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని శ్రేయ వెల్లడించారు.  ఈ శుభ సమయంలో అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ  శ్రేయా ట్వీట్‌ చేశారు. దీంతో ఆమెకు అభినందనల వెల్లువ కురుస్తోంది. 

2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన మిత్రుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను పెళ్లాడిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ .. బాలీవుడ్‌.. మాలీవుడ్‌.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ ఇలా పలు భాషల్లో తన అద్భుత గాత్రంతో అలరిస్తున్నారామె.  తన విశేష ప్రతిభకు గాను పలు భాషల్లో అనేక జాతీయ పురస్కారాలను సొంతం చేసుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు