శ్రియ గమనం

12 Sep, 2020 03:19 IST|Sakshi
శ్రియ

శ్రియ కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘గమనం’. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్‌ విడుదల చేశారు. పోస్టర్‌లో మధ్యతరగతి  యువతిలా కనిపిస్తున్నారు శ్రియ. ఓ రియల్‌ లైఫ్‌ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సృజనరావు తెరకెక్కించారు. కెమెరామేన్‌ జ్ఞానశేఖర్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తూనే రమేశ్‌ కరుటూరి, వెంకీ పుషడపులతో కలిసి నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందించారు. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు రాశారు.

మరిన్ని వార్తలు