పెళ్లి చేసుకుంటావా? నెటిజన్‌ ప్రశ్నకు శృతి దిమ్మతిరిగే ఆన్సర్‌

8 Jun, 2021 16:39 IST|Sakshi

హీరోయిన్‌ శృతీహాసన్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఇక శృతి లైవ్‌లోకి రాగానే.. నెటిజన్లు తమ మనసులోని ప్రశ్నలన్నింటిని ఆమె ముందు ఉంచారు. 

ప్రభాస్‌ సలార్‌లో మీ పాత్ర ఏమిటి? అందులో క్రాక్ సినిమాలో మాదిరిగా ఫైట్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ సమాధానం ఇస్తూ.. సలార్‌లో నాది మంచి పాత్ర. ఇప్పుడు వివరాలు వెల్లడించలేను. అయితే నాకు ఫైట్స్ లేవు. ప్రభాస్‌తో ఫైట్ చేయలేను అని చెప్పారు. ఇక ఓ తుంటరి నెటిజన్‌..  మీ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలి అంటూ అడిగితే.. అబ్బో.. నా నెంబర్ కావాలా అంటూ నవ్వుతూ నో అని చెప్పారు. అలాగే లైవ్‌లో మరో నెటిజన్ నన్ను పెళ్లి చేసుకొంటావా? అని ప్రశ్న వేస్తే.. చేసుకొను అంటూ సున్నితంగా తిరస్కరించింది. మీరు నటించిన ఓ మై ఫ్రెండ్ చిత్రం అంటే ఇష్టం. మీకు ఆ మూవీ గుర్తుందా అని మరో నెటిజన్‌  అడిగితే నాకు ఇష్టమైన సినిమా అది అని జవాబు ఇచ్చారు. అలాగే వైజాగ్‌కు ఎఫ్పుడు వస్తున్నారు అని అడిగితే.. చిన్నప్పటి నుంచి వైజాగ్‌తో అనుబంధం ఉంది. ఏదో సందర్భంలో వస్తూనే ఉంటాను అని శృతి చెప్పారు.
చదవండి:
ప్రేమలో పడిపోయా.. రష్మిక పోస్ట్‌ వైరల్‌
అకీరా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణూ దేశాయ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు