Shruthi Hassan: అలాంటివారే కలిసి ఉండగలరంటున్న శృతీ హాసన్‌

12 Jul, 2021 13:54 IST|Sakshi

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'క్రాక్‌'తో ప్రేక్షకులకు తనలోని మాస్‌ యాంగిల్‌ను రుచి చూపించింది హీరోయిన్‌ శృతీ హాసన్‌. ప్రస్తుతం ఆమె తెలుగులో ఒకే ఒక సినిమా చేస్తోంది. ప్రభాస్‌ సరసన 'సలార్‌'లో కథానాయికగా నటిస్తోంది. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శృతీ హాసన్‌ పాపులర్‌ అవుతూ వచ్చింది. గతంలో ఆమె ఓ ఫొటోగ్రాఫర్‌ను ప్రేమించిన విషయం తెలిసిందే. ఆయనతో పీకల్లోతు ప్రేమలో మునిగిన ఈ ముద్దుగుమ్మ ప్రియుడి కోసం సినిమాలను కూడా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ సడన్‌గా వారి ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్‌ పడింది.

కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరికీ బ్రేకప్‌ కావడంతో శృతీ తిరిగి సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. అంతలోపే ఆమెకు మరో కొత్త బాయ్‌ఫ్రెండ్‌ దొరికినట్లు తెలుస్తోంది. శాంతన్‌ హజారిక అనే చిత్రకారుడితో శృతీ ఈ మధ్య తరచూ కనిపిస్తుండటంతో వీరి మధ్య లవ్‌ ట్రాక్‌ నడుస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు ఈ భామ అతడితో కలిసి దిగిన ఫొటోలను, వీడియోలను స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుండటంతో ఈ కథనాలకు మరింత ఊతమిచ్చినట్లైంది.

తాజాగా శృతీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కిచెన్‌లో దూరిపోయిన శృతీ, శాంతన్‌ చికెన్‌ ఫ్రై తింటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. పనిలో పనిగా తను తింటున్న పీస్‌లో కొంత భాగాన్ని ప్రియుడికి కూడా తినిపించింది శృతీ. "అదో సాధారణ సాయంత్రం. ఫ్రీ ఫుడ్‌ దొరికింది, అంతే ఓ పట్టు పట్టాం. మా ఇద్దరికీ చికెన్‌ ఫ్రై అంటే తెగ ఇష్టం. కలిసి తినేవారే కలిసి ఉండగలరు" అని క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ వీడియో చూసిన జనాలు 'మీ తిండి చూస్తుంటే మాకు నోరూరుతుంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు